ఇటీవలి కాలంలో నిది దొరుకుతుంది అని భావిస్తే ఎంతటి దారుణానికి పాల్పడేవారు నేటి రోజుల్లో కనిపిస్తున్నారూ. ఉన్నపళంగా నిధి వస్తుంది అంటే ఇక ఏకంగా ఉన్న ఇంటిని కూల్చేసి తవ్వకాలు జరిపే వారు కూడా నేటి రోజుల్లో ఉన్నారు అని చెప్పాలి.. అంతేకాదండోయ్ ఏకంగా రక్త సంబంధానికి కూడా మరిచి సొంత నిధి కోసం నరబలి ఇవ్వడానికి కూడా ఎంతో మంది సిద్ధంగా ఉంటారు. అయితే నిదినిక్షేపాలు ఉన్నాయని ఎవరైనా బాబాలు చెప్పారు అంటే చాలు తప్పకుండా పాటిస్తూ ఉంటారు అని చెప్పాలి.


 నిధి నిక్షేపాలు ఉంటే మనకు చెప్పిన బురిడీ బాబా తవ్వు కుంటాడు  కానీ మనకెందుకు చెబుతాడు అన్న ఒక ఆలోచన మాత్రం చేయరూ. ఈ క్రమంలోనే నేటి ఆధునిక యుగంలో కూడా ఎంతో మంది జనాలు మాయ మాటలు నమ్మి మోసపోతూన్న ఘటనలు  రోజురోజుకీ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి అని చెప్పాలి. ఇక మోసపోయిన తర్వాత అసలు విషయం గ్రహించి లబోదిబోమంటున్నారు. కర్ణాటకలో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. వరి పొలం లో బంగారు నిధి ఉందని వాటిని వెలిక్కి తీస్తాను అంటూ భార్యాభర్తలను నమ్మించాడు ఒక స్వామీజీ.


 అమ్మో మన పొలం లో నిది ఉందంట.. ఇక అది బయటపడింది అంటే మనం కోటీశ్వరులం కావచ్చు అని ఎన్నో ఆశలు పెంచుకున్నారు ఆ దంపతులు. ఈ క్రమంలోనే స్వామీజీకి ఐదు లక్షలు సమర్పించుకున్నారు. హసన్ జిల్లా దొడ్డనకేరి గ్రామం లోని లీలావతి మంచే గౌడ దంపతులు ఈ పని చేశారు.  ప్లాన్ ప్రకారం ముందుగానే వారి పొలంలో గోల్డ్ పూతపోసిన మూడు కేజీలు సిల్వర్ విగ్రహాన్ని పాతి పెట్టాడు స్వామీజీ.  ఆ తర్వాత ఆ దంపతులను పొలానికి తీసుకెళ్లి ఏమో తాంత్రిక పూజలు చేసిన అనంతరం  విగ్రహాన్ని బయటకు తీశాడు. రక్తాభిషేకం చేయాలని లీలావతి వేలు కోసేసాడు. కానీ కొన్నాళ్ల తర్వాత విగ్రహాన్ని పరీక్షించి చూడగా సిల్వర్ అని తేలింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: