సాధారణం  గా దాంపత్య బంధం అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. భార్యా భర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు తలెత్తినప్పుడు సర్దుకు పోతూ జీవితం లో సంతోషం గా ఉండాల్సి ఉంటుంది. కానీ కొంతమంది భార్యాభర్తలు మాత్రం పెళ్లయి పిల్లలు పుట్టిన తర్వాత కూడా చిన్న చిన్న మనస్పర్థలకు సర్దుకు పోకుండా ఊరికే పోట్లాడుకోవడం లాంటివి చేస్తూ ఉన్నారు. మరికొందరు ఏకంగా ఎంతో నమ్మకం తో ఉండాల్సిన భార్య పై అనుమానం పెంచుకునీ చివరికి  కట్టుకున్న వారిని దారుణం గా హత మార్చిన ఘటన లు కూడా వెలుగు లోకి వస్తున్నాయి అని చెప్పాలి.


 ఇటీవలి కాలం లో దంపతులిద్దరి మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవలు కారణం గా జరుగుతున్న దారుణాలు రోజు రోజుకు ప్రతి ఒక్కరిని ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. ఇటీవలే ముంబై లో ఇలాంటి దారుణం వెలుగు చూసింది. రైల్వే ప్లాట్ ఫారం పై భార్యతో ఎంతో ప్రేమగా మాట్లాడుతున్న భర్త ఇక ట్రైన్ దగ్గరికి రాగానే ఊహించని విధంగా దారుణానికి పాల్పడ్డాడు. ముంబై సమీపం లోని పాల్గర్ జిల్లా  రైల్వే స్టేషన్లు ఈ ఘటన చోటు చేసుకుంది. తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో ఓ వ్యక్తి భార్య పిల్లలతో ప్లాట్ఫారంపై ఉన్నాడు.


 పిల్లలతో పాటు అక్కడే పడుకుని ఉన్న భార్య నిద్ర లేపి పక్కకు తీసుకు వెళ్ళాడు. చాలా సేపు ఏదో విషయంపై మాట్లాడుతూ ఉన్నాడు. వెనక నుంచి ఎక్స్ప్రెస్ రైలు వస్తుంది. రైలు సమీపంలోకి రాగానే భార్యను ఒక్కసారిగా పట్టాల మీదికి తోసేసాడు.  దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. వెంటనే  పిల్లలను తీసుకుని అక్కడినుంచి పారిపోయాడు.  ఏం జరిగిందో సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. వైరల్ గా మారిపోయిన వీడియో చూసి అందరూ షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: