సాధారణంగా భార్య భర్తల బంధం అంటే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది. వేదమంత్రాలు సాక్షిగా పెళ్లి చేసుకొని ఇక వివాహం సమయంలో ఎన్నో ప్రమాణాలు చేసినవారు. కష్టసుఖాల్లో కూడా తమ భాగస్వామికి తోడునీడగా ఉండాల్సి ఉంటుంది. కానీ ఇటీవలి కాలంలో మాత్రం చిన్నచిన్న కారణాలకే ఎంతోమంది గొడవలు పడుతూ చివరికి చేజేతులారా పచ్చని కాపురంలో చిచ్చు పెట్టుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.


 ఇటీవలి కాలంలో దాంపత్య బంధంలో తలెత్తుతున్న వివాదాలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అయితే ఇప్పటి వరకూ భర్త తాగొచ్చి భార్యను వేధించడం చీటికిమాటికి చేయి చేసుకోవడం.. సూటిపోటి మాటలతో మానసిక క్షోభకు గురి చేయడం లాంటి ఘటనలే తెరమీదకు వచ్చాయి. ఇక ఇలాంటివి చూసిన తర్వాత ఈ మగాళ్లు ఎప్పటికీ మారరు ఎప్పుడు ఆడవాళ్లను హింసిస్తనే  ఉంటారు అని ఎంతో మంది తిట్టుకునే ఉంటారు. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన చూసిన తర్వాత మాత్రం కేవలం ఆడాళ్ళు మాత్రమే కాదు మగాళ్లు కూడా భార్యల చేతుల్లో దెబ్బలు తింటారు.. వేధింపులు ఎదుర్కుంటారు అనేది అర్థం అవుతుంది.



 ఉత్తరప్రదేశ్ లోని కోవా గంజ్ కు చెందిన రామ్ ప్రవేశ్ తన భార్య తరచూ కొడుతుంది అన్న కారణంతో ఊహించని పనిచేశాడు. ఏకంగా వంద అడుగుల ఎత్తు ఉన్న చెట్టు ఎక్కాడు. కిందకి వస్తే తన భార్య కొడుతుందని భావించి భయంతో నెల రోజుల పాటు అక్కడే ఉండిపోయాడు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు తాడు సహాయంతో నీళ్లు ఆహారం పైకి పంపించడం చేశారు. ఇంకోవైపు అతడు తమ ఇళ్లల్లో ఏం జరుగుతుందో తొంగి చూసేందుకు  చెట్టు పైకి ఎక్కాడు అంటూ స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇక అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్ని కిందికి దింపేందుకు ఎంత ప్రయత్నించినా సదరు వ్యక్తి మాత్రం చెట్టుదిగి వచ్చేందుకు నిరాకరించాడు అని చెప్పాలి. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: