ఇటీవల కాలం లో మొబైల్ అనేది ప్రతి ఒక్కరి జీవితం లో భాగంగా మారి పోయింది అన్న విషయం తెలిసిందే. ఆహారం నీరు తీసుకోవడం ఎంత ముఖ్యమో ఇక మొబైల్ వాడడం కూడా అంతే ముఖ్యం అన్న విధంగా మారి పోయింది. తద్వారా మనిషి అవసరాలు మాత్రమే తీర్చే దానికి వచ్చిన మొబైల్ ఇక ఇప్పుడు మనిషిని శాసించే స్థాయికి ఎదిగింది. ఆరు అంగుళాలు మాత్రమే ఉండే మొబైల్ కాస్త ఆరడుగుల మనిషిని కంట్రోల్ చేస్తూ ఉంది అని చెప్పడం లో అతిశయోక్తి లేదు.. ఇక ఇలా నేటి రోజుల్లో ప్రతి ఒక్కరిని కూడా మొబైల్ బానిసగా మార్చుకుంటూ ఉంది.


 అయితే ఏది కావాలన్నా ఏం చేయాలన్న కూడా మొబైల్ లో అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఇక బయట ప్రపంచం తో ఎవరికి ఎలాంటి అవసరం లేకుండా పోయింది అని చెప్పాలి. ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా కూడా మొబైల్ తప్పకుండా వాడుతూ ఉన్నారు. మొబైల్ నిమిషం పాటు చేతిలో లేక పోయినా కూడా పిచ్చి పట్టిన వాళ్ళలా ప్రవర్తిస్తున్నారు అని చెప్పాలి. అంతేకాదు కొంత మంది ఛార్జింగ్ పెడుతూ మొబైల్ వాడటం లాంటివి కూడా చేస్తున్నారు.  అలా చేయడం అని తెలిసినప్పటికీ చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటూ వుంటారు.



 ఇక్కడ ఇలాంటి ఘటన వెలుగు లోకి వచ్చింది. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం ముధోలి నగర్ గ్రామం లో సెల్ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతుండగా విద్యుత్ షాక్కు గురై ప్రవీణ్ కుమార్ అనే 29 ఏళ్ల యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అయితే వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు సీతారామపురం లో ఉన్న ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. అయితే అతను ఫోన్ మాట్లాడుతున్న సమయంలో ఉరుములు మెరుపులు రావడంతో విద్యుత్ షాక్కు గురైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: