ఇటీవలి కాలంలో టెక్నాలజీ పెరిగిపోయిన నేపథ్యంలో మనిషికి మొబైల్ తో ఎంతో దగ్గర అనుబంధం ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పక్కన మనుషులు లేకపోయినా ఉంటారేమో కానీ అరచేతిలో మొబైల్ లేకపోతే మాత్రం నిమిషం కూడా ఉండలేని విధంగా మారిపోయింది మనిషి పరిస్థితి. ఒక మొబైల్ చేతిలో పెట్టి మనిషిని ఎక్కడ వదిలేసినా బ్రతికేస్తాము అనే విధంగా ప్రతి ఒక్కరి ఆలోచన విధానం మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇటీవలి కాలంలో అటు మొబైల్ వాడకం పెరిగిపోయింది.  ఎంతో మంది  హెడ్ ఫోన్స్ కూడా ఎక్కువగానే వాడుతూ ఉన్నారు. ఒక్కసారి హెడ్ ఫోన్స్ చెవిలో పెట్టుకొని పాటలు స్టార్ట్ చేశారు అంటే చాలు ఇక బయట ప్రపంచాన్ని మరిచి పోతున్నారు అని చెప్పాలి.


 వెరసి ఇలా హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కూడా నెలకొంది. ఎందుకంటే ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకొని చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనే విషయాన్ని కూడా గమనించకుండా గుడ్డిగా అటూ ఇటూ తిరుగుతూ ఉండటం కారణంగా కొన్ని సార్లు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయ్. కొన్నిసార్లు రైలు ఢీ కొట్టి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. బయటికి వెళ్లినప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకోవద్దని అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.


 అయినా యువత తీరులో మాత్రం మార్పు రావడం లేదు.  ఇక్కడ ఇయర్ఫోన్స్ మరో యువకుడి ప్రాణాలు తీశాయి. పాటలు వింటూ పట్టాలు దాటపోయాడు. కాని రైలు వస్తుంది గమనించలేదు. దీంతో రైలు ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన జడ్చర్ల రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. బాదేపల్లి లోని బక్క రావు కాంపౌండ్ లో ఉండే వినయ్ కుమార్ అనే 19 ఏళ్ల యువకుడు ఐ టి ఐ  చదువుతున్నాడు. అయితే ఇటీవలే జిమ్ కు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని  రైల్వే స్టేషన్ దగ్గర పట్టాలు దాటపోయాడు. దూసుకొస్తున్న రైలును గమనించలేదు. దీంతో రైలు ఢీకొని అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: