
ఇక నేటి తరం క్రికెటర్లు అందరికీ కూడా మహేంద్ర సింగ్ ధోనీ ఆదర్శంగా నిలుస్తూ ఉంటాడు అని చెప్పాలి. ధోని ఎక్కడైనా కనిపించాడు అంటే చాలు అతనికి ఎంతగానో గౌరవిస్తూ ఉంటారు యువ క్రికెటర్లు.. కానీ ఇక్కడ ఒక మాజీ ఆటగాడు మాత్రం మహేంద్రసింగ్ ధోని పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు ఫాస్ట్‌బౌలర్ ఈశ్వర్ పాండే గుడ్ బై చెప్పాడు అనే విషయం తెలిసిందే. ఒక అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకుండానే రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు తెలిపాడు. విరాట్ కోహ్లీ,మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్,సురేష్ రైనా, ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్ లాంటి గొప్ప ఆటగాళ్ళతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ఎంతో ప్రత్యేకమైనది అంటూ తెలిపాడు.
భారత్ తరఫున ఒక అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడనందుకు చింతిస్తున్నాను అంటూ తెలిపాడు. అదే సమయంలో ధోని పై సంచలన ఆరోపణలు చేశాడు. ధోని నాకు అవకాశాలు ఇచ్చి ఉంటే నా కెరీర్ మరోలా ఉండేది. అప్పుడు నా వయసు 24 ఏళ్లు ఫిట్నెస్ కూడా బాగుంది. అప్పుడు ధోనీ బాయ్ నాకు టీమిండియాలో అవకాశం ఇచ్చి ఉంటే నేను నా దేశం కోసం బాగా రాణించేవాడిని.. కానీ నాకు అవకాశాలు దక్కలేదు అంటూ తెలిపాడు. ధోని కారణంగానే తన కెరీర్ మొత్తం నాశనం అయింది అంటూ వాపోయాడు ఈశ్వర్ పాండే. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడక పోయినప్పటికీ దేశవాళీ క్రికెట్లో మాత్రం బాగా రాణించాడు.