ప్రేమ అనే రెండక్షరాల పదాన్ని ఇటీవలే మనుషులు కమర్షియల్ ఎలిమెంట్ గా మార్చుకుంటున్నారు ఈ క్రమం లోనే కేవలం అవసరాలు తీర్చు కోవడానికి మాత్రమే ప్రేమ అనే నాటకం ఆడుతూ చివరికి అవసరాలు తీరిన తర్వాత దారుణం గా ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగు లోకి వస్తున్నాయి. కాగా సినిమాల ప్రభావం కారణం గా అచ్చం సినిమాల్లో చేసినట్లుగానే ఎన్నో దారుణాలకు పాల్పడుతున్న ఘటనలు ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని తిరుపతి జిల్లా కైలాస కోన లో ఇటీవలే ఓ మహిళ అనుమానాస్పదం గా చనిపోవడం సంచలనం గా మారి పోయింది. ఈ క్రమంలోనే మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు ఆమెది హత్య అనే విషయాన్ని తేల్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే చెన్నైకు చెందిన మదన్ తమిళ సెల్వి అనే యువకుడు యువతిని ప్రేమించి పెళ్లాడాడు. కానీ చెడు వ్యసనాలకు బానిసై భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. ఓ రోజు భార్య అడ్డు తొలగించుకోవాలని కైలాసకోన కు తీసుకువచ్చి కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఇక పోలీసుల విచారణలో ఈ షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.