సాధారణంగా భార్యాభర్తల మధ్య శారీరక సంబంధం అనేది ఒక మధుర అనుభూతి అనే విషయం తెలిసిందే. ఇక ఇలా శారీరక బంధం ఎంతో బలంగా ఉన్నప్పుడే దాంపత్య బంధంలో కూడా ఎలాంటి మనస్పర్ధలు గొడవలు లాంటివి రావు అంటూ ఎంతో మంది పెద్దలు కూడా చెబుతూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఎంతోమంది వ్యక్తులు తమ భార్యలను ఏకంగా ఆట బొమ్మల్లాగా చూస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. ఎందుకంటే అసహజ రీతిలో శృంగారం చేస్తూ చివరికి దారుణంగా ప్రవర్తిస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి అన్న విషయం తెలిసిందే.


 ఇక భర్త వేధింపులు తట్టుకోలేక చివరికి భార్యలు పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తూ న్యాయం చేయాలంటూ కోరుతున్న ఘటనలు కూడా ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. అతనికి భార్యపై ఎంతగానో అనుమానం. దీంతో భార్యను ఎలాగైనా సరే హింసించాలి అనే నిర్ణయించుకున్నాడు. దీంతో అసహజ పద్ధతిలో శృంగారం చేయడం మొదలుపెట్టాడు. అంతే కాదు అనేక రకాలుగా ఆమెను మానసికంగా శారీరకంగా హింసిస్తూ ఉండేవాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో షిప్రా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.


 ఇకపోతే ఇటీవలే సదరు భర్త ఆకృత్యాలు మరింత మితిమీరి పోయాయి అని చెప్పాలి. ఇటీవల తన భార్య జననావయం పై వేడిగా ఉన్న కత్తిని అదిమిపెట్టి ఉంచాడు. ఇక ఈ దారుణం కారణంగా సదరు మహిళలు చివరికి ఆసుపత్రిలో చేరింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది అన్నది తెలుస్తుంది. అయితే ప్రతి రోజు కూడా తనపై అనుమానం వ్యక్తం చేస్తూ సూటిపోటి మాటలతో మానసికంగా వేధించడమే కాదు శారీరకంగా కూడా ఇలా ఎన్నో రకాలుగా హింసించేవాడు అంటూ పోలీసులకు ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: