సాధారణంగా పెళ్లి అయిన తర్వాత పిల్లలు పుడితే వారితో ఆడుకోవాలని ఎంతో మంది భార్య భర్తలు భావిస్తూ ఉంటారు. అయితే కొంతమందికి పెళ్లి అయిన కొన్నాళ్ళకి పిల్లలు పుడితే.. మరి కొంతమందికి మాత్రం పెళ్ళై ఏళ్ళు గడుస్తున్నా కూడా పిల్లలకు నోచుకోరు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అమ్మ అని పిలిపించుకునే భాగ్యం కలగకపోవడంతో మహిళలు ఎంతగానో మనస్థాపం చెందుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో ఇక ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా నమ్ముతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక తమకు ఉన్న ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకోవడానికి వైద్యుల దగ్గరికి వెళ్లకుండా ఏకంగా బురిడీబాబాల దగ్గరికి వెళ్లి లక్షలు పోగొట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.


 ఇలా నేటి టెక్నాలజీ యుగంలో కూడా మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అని గుడ్డిగా నమ్ముతూ చివరికి ఎంతోమంది బురిడీ బాబాల చేతిలో మోసపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది.  ఏళ్ళు గడుస్తున్న ఆమెకు పిల్లలు కాలేదు. దీంతో అమ్మ అని పిలిపించుకోవాలనె ఆశ ఆమెను గుడ్డి నమ్మకాల వైపు నడిపించింది. తన బాధ మరో మహిళకు చెప్పుకుంది. దీంతో తాంత్రికూడు పూజలు చేస్తే పిల్లలు పుడతారని ఆమె ఒక చెత్త సలహా ఇచ్చింది.


 ఎలాగైతేనేం తల్లి కావాలని ఆశ నెరవేరితే చాలు అని భావించింది సదరు బాధితురాలు. ఈ క్రమంలోనే మరో మహిళ చెప్పిన సలహాను వెనుక ముందు ఆలోచించకుండా గుడ్డిగా ఫాలో అయింది. ఈ క్రమంలోనే సదరు మహిళ చెప్పిన భర్తను ఒప్పించి తాంత్రికూడిని  సంప్రదించింది. పూజలకు ఎనిమిది లక్షలు ఖర్చు అవుతుందని చెప్పిన తాంత్రికడు ఓ రోజు ఇంట్లో పూజలు చేస్తూ దంపతులను ఇంటి బయటకి పంపించాడు. ఇక మూడు గంటల తర్వాత ఇంట్లోకి వచ్చి చూడగా తాంత్రికుడు తో పాటు డబ్బులు కూడా మాయమయ్యాయి. దీంతో పోలీసులను ఆశ్రయించింది ఈ జంట. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో వెలుగు చూసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: