ఇటీవల కాలం లో ఆత్మహత్య చేసుకోవడం అనేది చాక్లెట్ తిన్నంత  సులభంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. చిన్న కారణాలకి క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటూ బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు నేటి రోజుల్లో కోకోల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తల్లితండ్రులు మందలించారని లేదా టీచర్ తిట్టిందని.. స్నేహితులతో గొడవ జరిగిందని లేదంటే పరీక్షల్లో ఫెయిలయ్యమని ఇలా చిన్నచిన్న కారణాలకే మనస్థాపం చెందుతున్నారు ఎంతో మంది యువత. ఈ క్రమంలోనే ప్రాబ్లంస్ సాల్వ్ చేసుకునే దారిని ఆలోచించకుండా చివరికి క్షణికావేశంలో నిర్ణయం తీసుకుంటూ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.


 ఇలా ఎంతోమంది క్షణికావేశంలో  తీసుకున్న నిర్ణయాలు కారణంగా ఎన్నో కుటుంబాలు చివరికి విషాదంలో మునిగిపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దేవుడు ఇచ్చిన అమూల్యమైన నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా  మనుషులే చేజేతులారా ముగిస్తున్నారూ. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఇటీవల కాలంలో మద్యానికి బానిసగా మారిపోతున్న మనుషుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. కుటుంబ బాధ్యతలను గాలికి వదిలేసి మద్యం కిక్కులో ఊగుతూ తూగుతూ చివరికి బానిసగా  మారిపోతున్నారు.


  హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11 లో ఉదయ నగర్ లో నివసించే శంకర్ అనే వ్యక్తి మద్యానికి బానిసగా మారిపోయాడు. అయితే రాత్రి తాగి ఇంటికి రాగా మందు తాగొద్దని  కుటుంబీకులు మందలించారు. దీంతో ఎంతగానో మనస్థాపం చెందిన సదరు వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటాను అంటూ కుటుంబ సభ్యులను బెదిరించాడు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా వంట గదిలోకి వెళ్లి అక్కడ ఉన్న కూరగాయలు కోసే కత్తితో గొంతు కోసుకున్నాడు. కాసేపటికి రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు.. అయితే మొదట స్వల్ప గాయంగా గమనించిన కుటుంబ సభ్యులు పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత ఆసుపత్రికి తరలించిగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: