కరోనా వైరస్ సమయంలో డాక్టర్లు చేసిన సాహసం మాటల్లో వర్ణించడం చాలా కష్టం అని చెప్పాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో తాము హ్యాపీగా ఉన్నామా లేదా అన్నది మాత్రమే అందరూ చూసుకుంటున్నారు. ఇక ఎదుటి వ్యక్తి ఏమైపోతే మనకెందుకు అన్న ధోరణితోనే అందరూ వ్యవహరిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ముఖ్యంగా కరోనా వైరస్ సమయంలో అయితే ప్రతి ఒక్కరిలో ఇలాంటి ఆలోచనలు బాగా పెరిగిపోయాయి. మన కుటుంబం సేఫ్ గా ఉంటే చాలు పక్క వాళ్ళు కరోనా వైరస్ బారిన పడిపోయి నాశనం అయిపోయిన పర్వాలేదు అన్న విధంగానే ఎంతోమంది వ్యవహరించారు.


 కరోనా వైరస్ భయం కారణంగా కళ్ళ ముందు ప్రాణాలు కోల్పోతున్న కూడా కనీస మానవత్వాన్ని చూపించని పరిస్థితి కనిపించింది. ఇలాంటి సమయంలో ఏమాత్రం పొరపాటు జరిగిన ప్రాణాలు కోల్పోతాయని తెలిసిన కూడా వైద్యులు సాహసం చేసి తమ ప్రాణాలను పణంగా పెట్టి కోట్ల మంది ప్రాణాలను కాపాడారు. దీంతో వైద్యులు ప్రత్యక్ష దైవం అని అందరూ నమ్మడం మొదలుపెట్టారు. ఇలాంటి సమయంలో కొంతమంది వైద్యులు మాత్రం నిర్లక్ష్యమైన వైఖరితో ఎంతోమంది అమాయకమైన పేషంట్ల ప్రాణాలు తీస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.


 ఒడిశా మల్కాన్ గిరి జిల్లాలో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఓ డాక్టర్ భార్య అత్యుత్సాహం చివరికి పేషంట్ ప్రాణాలు పోవడానికి కారణమైంది. కలిమెలా సమితికి చెందిన తపాస్ పాల్ పన్ను నొప్పితో బాధపడుతూ స్థానిక డాక్టర్ రవీంద్రనాథ్ దగ్గరకు వెళ్ళాడు. ఇక ఆ సమయంలో డాక్టర్ లేకపోవడంతో ఆయన భార్య బసంతి తానే డాక్టర్ అన్న విధంగా వ్యవహరించింది. ఏకంగా సదరు వ్యాపారి పన్ను తొలగించింది. ఈ క్రమంలోనే తీవ్ర రక్తస్రావం జరిగింది. అయితే తపాస్ పాల్ ఇంటికొచ్చిన కూడా రక్తస్రావం ఆగలేదు. కొద్దిసేపటికి పరిస్థితి విషమించి అతను చనిపోయాడు. విషయం తెలుసుకున్న డాక్టర్ రవీంద్ర అతని భార్య బసంతి కూడాకనిపించకుండా పారిపోయారు.కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: