ఇటీవల కాలంలో బంధాలకు బంధుత్వాలకు కాస్తైన విలువ ఇవ్వని మనిషి క్రూరంగా మారిపోతున్న తీరు చూసి సభ్య సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ భయంతో వణికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు ఏదైనా హాని కలిగిన పరాయి వ్యక్తుల నుంచి మాత్రమే ప్రమాదం ఉండేది అని అనుకునేవారు. కానీ ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత కూడా సొంత వారిని కూడా నమ్మలేని పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. ఎందుకంటే రక్తం పంచుకొని పుట్టిన వారు కట్టుకున్న వారు అనే తేడా లేకుండా దారుణంగా హత్యలకు పాల్పడుతూ ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నారు.


 తమిళనాడులో కూడా ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.  టుటి కోరిన్ జిల్లాలోని కోవిల్ పట్టి అటవీ ప్రాంతంలో 42 ఏళ్ల వ్యక్తి కాలిపోయిన మృతదేహం లభ్యమయింది. అయితే అక్కడ దొరికిన కొన్ని క్లూస్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ఓ మహిళను ఆమె 15 ఏళ్ల కుమార్తెను సహా మరో ముగ్గురుని అరెస్టు చేశారు.. పోలీస్ విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకు గురైన వ్యక్తి చేపల వ్యాపారి జ్ఞాన శేఖర్ గా పోలీసుల గుర్తించారు. ఆ వ్యక్తికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారట.


 అయితే పోలీసు విచారణలో కుటుంబ సభ్యులు విచిత్రమైన వాంగ్మూలం ఇవ్వడంతో అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేశారు. దీంతో కుటుంబ సభ్యులె హత్య చేశారని విషయం వెలుగులోకి వచ్చింది. జ్ఞాన శేఖర్ భార్యకు అక్రమ సంబంధం ఉందని.. పెద్ద కుమార్తె కార్తీక్ అనే 24 ఏళ్ళ యువకుడితో సంబంధం పెట్టుకుందని.. విషయం తెలిసి జ్ఞాన శేఖర్ వాళ్లకు వార్నింగ్ ఇవ్వడంతో గొడవ తీవ్ర రూపం దాల్చింది. ఈ క్రమంలోనే భార్యతో పాటు పెద్ద కుమార్తె కలిసి జ్ఞాన శేఖర్ ను చంపినట్లు పోలీసు విచారణలో తేలింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: