అందుకే ఎంతోమంది అటు ఇంటికి సమీపంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసేందుకు కూడా అనుమతి ఇవ్వరు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవలే ఒక వ్యక్తి నిర్లక్ష్యంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర మూత్ర విసర్జన చేసి చివరికి ప్రాణాలను కోల్పోయిన ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది. ఇటీవల కాలంలో ఎంతోమంది ఎక్కడపడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇలాగే ఒక వ్యక్తి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర మూత విసర్జన చేసేందుకు ప్రయత్నించాడు. కానీ చివరికి ప్రాణం పోయింది.
ఈ ఘటన నెల్లూరులోని జాకీర్ హుస్సేన్ నగర్ లో వెలుగు చూసింది అని చెప్పాలి. గుప్తా పార్క్ జంక్షన్ లోని ట్రాన్స్ఫార్మర్ వద్ద ఆలీ అనే 29 ఏళ్ల యువకుడు మూత్ర విసర్జన చేశాడు. అయితే ఇలా మూత్ర విసర్జన చేస్తున్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్ షాకీ గురై అక్కడికక్కడే విలవిలలాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. మూత్ర విసర్జన చేస్తున్న సమయంలో పొరపాటున అతని చేయి పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ కు తగలడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. గమనించిన స్థానికులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే యువకుడు మృతి చెందాడు అన్న విషయాన్ని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.