ఇటీవల కాలం లో మనుషుల ప్రాణాలు ఎంత సింపుల్గా గాల్లో కలిసి పోతున్నాయో చూస్తూనే ఉన్నాం. ఎంతో మంది వ్యక్తులు అంతా సరదాగా గడుపుతూన్న సమయం లో ఎవరు ఊహించిన విధంగా క్షణకాల వ్యవధిలో గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.  ఇలాంటివి చూసినప్పుడు మనిషి జీవితం ఇంతేనా అని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇలా ఏకంగా క్షణాల్లో గుండెపోటు కారణంగా ఎంతో మంది మరణిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి.


 ఇలాంటివి చూసినప్పుడు మృత్యువు ఎప్పుడు ఎటువైపు నుంచి దూసుకు వచ్చి ప్రాణాలను తీసేస్తుంది అన్నది ఊహకిందని విధంగానే ఉంటుంది అని ఎంతోమంది అనుకుంటున్నారు. ఇక్కడ అంత్యక్రియలకు వెళ్లిన ఎంతోమంది బంధువులను అనుకొని విధంగా మృత్యువు వెంటాడింది  స్మశానంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో తేనెటీగల గుంపు ఒక్కసారిగా అటాక్ చేసింది. ఈ ఘటనలో 12 మందికి గాయాలు అయితే ఒకరు చివరికి మృత్యువాత పడ్డారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.


 మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని ఉబ్బేరు చేలుక గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చంద్రకాంత అనే వృద్ధురాలు మృతి చెందగా ఆమె అంత్యక్రియల కోసం బంధువులు కుటుంబ సభ్యులు స్మశానానికి చేరుకున్నారు. అయితే అక్కడే ఉన్న తేనెటీగల గుంపు ఒక్కసారిగా దాడి చేయడంతో దాన్నుంచి తప్పించుకునేందుకు వీలు లేకుండా పోయింది. అక్కడి నుంచి పరుగులు పెట్టిన అప్పటికే తేనెటీగలు దారుణంగా దాడి చేశాయ్. ఈ ఘటనలో బొల్లంపల్లి బాపు అనే వ్యక్తి స్పాట్లోనే మృతి చెందాడు. ఇక ఈ ఘటనలో గాయపడ్డ వారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

అయితే చితికి నిప్పు పెట్టిన సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో ఇక అక్కడే ఉన్న కందిరీగల గుంపు ఒక్కసారిగా పైకి లేచి దాడి చేశాయి అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: