

అంతే కాదు తన తండ్రి హత్య చేసిన మహిళల మృతదేహాలను పూడ్చి పెట్టేందుకు తనతో పాటు తన సోదరులు కూడా సహాయం చేసే వాళ్ళం అన్న విషయాన్ని లూస్ స్టడీ అనే మహిళ న్యూస్ వీక్ ఇంటర్వ్యూలో చెప్పడం ఇక అమెరికాలో ప్రకంపనలు సృష్టించింది. అంతే కాదు ఆ మృతదేహాలు అన్నింటినీ కూడా ఎక్కడ పాతిపెట్టారు కూడా తనకు తెలుసు అంటూ చెప్పింది.. కాగా నిందితుడు డోనాల్డ్ స్టడీ 75 ఏళ్ల వయసులో 2013లో మరణించాడు. అయితే ఇటీవల ఈ కిరాతకుడు చేసిన హత్యలపై అతని కూతురు మాత్రం షాకింగ్ విషయాలను బయట పెట్టింది.
మా ఇంటికి సమీపంలో ఉన్న బావి, కొండ ప్రాంతాలలో మృతదేహాలను పాతిపెట్టినట్లు చెప్పుకొచ్చింది. ఇక ఇలా తన తండ్రి హత్య చేసిన వారి మృతదేహాలను తీసుకువెళ్లేందుకు తోపుడు బండిని ఉపయోగించేవాళ్ళం అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇలా నిందితురాలు చెప్పిన వివరాల ప్రకారం మృతదేహాలను వంద అడుగుల లోతైన బావిలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే లూసీ స్టడీ అనే మహిళ తన తండ్రిపై సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఒకవేళ ఆమె ఆరోపణలు నిజమని తెలిస్తే మాత్రం అమెరికా చరిత్రలోనే అతిపెద్ద సీరియల్ కిల్లర్ గా డోనాల్డ్ స్టడీ మారతాడని అధికారులు చెబుతున్నారు.