ఇటీవల కాలంలో మనుషుల కంటే కుక్కలకే ఎక్కువగా వాల్యూ ఇస్తున్నారా అంటే ప్రస్తుతం జరుగుతున్న ఘటనలు మాత్రం అందరి నోటా అవును అనే సమాధానం వచ్చేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఎందుకంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత తల్లిదండ్రులను భరించలేం అంటూ ఓల్డేజ్ హోమ్ లలో వదిలేస్తూ ఉన్నారు తల్లిదండ్రులు. కానీ ఖరీదైన కుక్కలను తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటూ ఆ కుక్కలకు సపర్యలు చేస్తూ ఇక తాము తిన్న ఆహారం కంటే ప్రత్యేకమైన ఆహారాన్ని ఆ కుక్కలకు పెడుతూ ఉన్నారు అని చెప్పాలి.


 అంతేకాదు ఇంట్లో ఎంతమంది మనుషులు ఉన్నా మనుషుల అందరి పైన చూపించిన ప్రేమ కంటే ఇక పెంపుడు కుక్కల మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్న వారు కూడా నేటి రోజుల్లో చాలామంది ఉన్నారు అని చెప్పాలి. ఇలా కొంతమంది ట్రెండు ఫాలో అవ్వడానికి పెంపుడు కుక్కలను పెంచుకుంటూ ఉంటే ఇంకొంతమంది ఇక జంతు ప్రేమికులు ఇలా కుక్కలను తెచ్చుకొని పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు.  ఇక్కడ ఒక పెంపుడు కుక్క కారణంగా దారుణ హత్య జరిగింది. ఈ ఘటన కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ అందరిని అవాక్కయ్యేలా చేస్తుంది.


 తన పెంపుడు కుక్కకు ఆహారం పెట్టడం విషయంలో కాస్త ఆలస్యం చేశాడు అన్న విషయంలో కోపంతో ఊగిపోయిన యువకుడు తనకు వరుసకు సోదరుడు అయ్యే ఒక బంధువుని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన కేరళలోని పాలక్కాడ్ లో వెలుగు చూసింది. హకిమ్ అనే వ్యక్తి వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతని బంధువు అర్షద్ కూడా అతనితో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలోనే తన కుక్కకి ఆహారం అందించే విషయంలో ఇటీవల ఆలస్యం చేశాడని హకీమ్ ఏకంగా హర్షద్ పై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తీవ్ర గాయాల పాలైన హర్షద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: