వెరసి నేటి సభ్య సమాజంలో ఎక్కడ చూసిన రక్తపాతమే కనిపిస్తుంది అని చెప్పాలి. ఒక మనిషిని చంపితే జైలు శిక్ష పడుతుందని.. చిప్పకూడు తినాల్సి వస్తుందని ఎవరు కూడా భయపడటం లేదు. ఆస్తులు అంతస్తులే ముఖ్యం అనుకుంటూ పక్కా ప్లాన్ ప్రకారం సొంతవారనే దారుణంగా హతమారుస్తున్న ఘటనలు అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా మద్యానికి బానిసగా మారిపోయిన తండ్రిని కుమారులు దారుణంగా హతమార్చిన ఘటన యాదాద్రి జిల్లాలో వెలుగు చూసింది అని చెప్పాలి.
ఆలేరు మండలం తూర్పు గూడెం గ్రామానికి చెందిన భాస్కర్ అనే 45 ఏళ్ల వ్యక్తిని ఇద్దరు కుమారులు కూడా దారుణంగా కత్తులతో పొడిచి చంపారు. అయితే తండ్రి రోజు మద్యం తాగి వచ్చి తల్లిని చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. దారుణంగా కొడుతూ ఉండడంతో కొన్నాళ్లపాటు ఓపికగా ఉన్న కుమారులు తర్వాత విచక్షణ కోల్పోయారు.. తండ్రి మారుతాడు అని భావించిన అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తండ్రి నుంచి తల్లికి విముక్తి కల్పించేందుకు చివరికి కన్నతండ్రిని దారుణంగా హత్య చేశారు ఇద్దరు కుమారులు. ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనంగా మారిపోయింది.