ఈ ఘటన కాస్త జనగామ జిల్లాలో చర్చనీయాంశంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇందుకు సంబంధించి టాస్క్ ఫోర్స్ అధికారులకు సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు సదరు నకిలీ వైద్యుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతాకు చెందిన ఆకాష్ కుమార్ బిశ్వాస్ 10వ తరగతి కూడా పాస్ కాలేదు. కానీ కొంతకాలం పాటు తన తాత వద్ద ఆయుర్వేద వైద్యాన్ని నేర్చుకొని జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం శివుని పల్లి కి 10 ఏళ్ల క్రితం వైద్యుడిగా వచ్చి క్లినిక్ నడుపుతున్నాడు.
ఇండియన్ ఆయుర్వేదిక్ మెడిక్ అనే బోర్డు తగిలించుకొని రోగులకు వైద్యం అందించడం మొదలు పెట్టాడు అని చెప్పాలి. ఒకవేళ ఇతను ఇచ్చిన మందులతో వ్యాధి తీవ్రతరం అయితే మాత్రం పెద్ద ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నాడు. స్థానికులు అనుమానం వచ్చి టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన అధికారులు అతని అరెస్టు చేశారు. ముందుగా సోదాలను నిర్వహించగా.. ఎలాంటి అర్హత లేకుండానే వైద్యం చేస్తున్నాడని అధికారులు గుర్తించారు. కాగా ఈ నకిలీ డాక్టర్ పదేళ్లలో 3650 మందికి పైగా రోగులకు వైద్యం అందించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన స్థానికులను షాక్ కు గురి చేసింది.