భార్యాభర్తలు అన్న తర్వాత అప్పుడప్పుడు చిన్నపాటి గొడవలు జరగడం సర్వసాధారణంగా ఉంటుంది. ఇక ఇలా గొడవలు జరిగినప్పుడే భార్యాభర్తల బంధం మరింత బలపడుతుంది అని ఎంతో మంది పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం దంపతుల మధ్య తలెత్తిన చిన్న గొడవ కారణంగా క్షణికా విషయంలో నిర్ణయాలు తీసుకుంటూ ఏకంగా కట్టుకున్న వారిని దారుణంగా హతమారుస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. సరితతో హేమంత్ కు చాలా ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.
అయితే ఇటీవలే రాత్రి హేమంత్ భోజనానికి కూర్చున్నాడు. సరిత ఇక ఎప్పటి లాగానే ప్లేట్లో అన్నం అందించింది. అయితే అన్నంలో చీమలు ఉండడంతో కోపంతో ఊగిపోయాడు హేమంత్. చీమలు ఉన్న అన్నం పెట్టావ్ ఏంటి అంటూ భార్యను నిలదీసాడు. ఒక్కరోజు కాదు రోజు ఇలాగే ఇస్తున్నావు అంటూ మండిపడ్డాడు. ఇక ఆమె కూడా మాటకు మాట సమాధానం చెప్పడంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. అయితే సహనం కోల్పోయిన సరిత రాత్రి భర్త పడుకున్న తర్వాత మెడకు చున్ని బిగించి దారుణంగా హత్య చేసింది. ఉదయం ఏమి తెలియనట్లుగా కన్నీళ్లు పెట్టుకుంది. అయితే హేమంత్ తండ్రి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇక పోలీసు విచారణలో అసలు విషయం బయటపడింది.