ఈ క్రమంలోనే బిల్డింగ్ వెనుక భాగంలో ఉన్న పైప్ లైన్ ద్వారా చివరికి ఆ బిల్డింగ్ లోకి ప్రవేశించారు. ఆ తర్వాత తమ వెంట తెచ్చుకున్న కట్టర్స్ తో కిటికీలను కట్ చేసి ఇక నగల దుకాణంలోకి చొరబడ్డారు. కోటిన్నర రూపాయల విలువైన నగలను వజ్రాలను కూడా దోచుకొని పోయారు ఆ దొంగల ముఠా. దీంతో పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు షోరూం ఎదురుగా ఉన్న మరో షో రూమ్ లో తలదాచుకున్నారు. ఈ ఘటన చెన్నైలోనే తాంబరంలో గల ప్రముఖ నగల దుకాణం బ్లూ స్టోన్స్ లో జరిగింది. అయితే ఉదయాన్నే ఎప్పటిలాగే ఇక దుకాణం తెరిచిన సిబ్బంది అక్కడ అన్ని చిందర వందర గా ఉండడం చూసి చోరీ జరిగినట్లు గుర్తించారు.
వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఇక హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సిసిటివి విజువల్స్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే షోరూం ఎదురుగా ఉన్న మరో రూంలోనే నిందితులు దాక్కున్నట్లు గుర్తించి వెంటనే అరెస్టు చేశారు. చోరీకి పాల్పడిన ముఠా అస్సాం కు చెందిన వారుగా గుర్తించారు. కాగా ఇక ముగ్గురు నిందితుల్లో ఇద్దరు మైనర్లే ఉన్నట్లు పోలీసు విచారణలో కూడా తేలింది. అయితే ఎమర్జెన్సీ అలారం మోగినప్పటికీ అటు సెక్యూరిటీ సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో ఈ చోరీపై మరింత లోతుగా విచారణ చేస్తున్నారు పోలీసులు.