గత కొంత కాలం నుంచి చలి పులిలా విరుచుకుపడుతుంది అన్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలలో చలి తీవ్రత అంతకంతకు పెరిగిపోతున్న నేపథ్యంలో  ఉదయం సమయంలో ఇంటి నుంచి కాలు బయటపెట్టాలంటేనే భయపడిపోతున్న పరిస్థితి. చలి నుంచి తప్పించుకునేందుకు శరీరం మొత్తం కవర్ చేస్తూ స్వెటర్ వేసుకున్న కూడా చలి తీవ్రతకు మాత్రం వనికిపోతున్నారు జనాలు. సాధారణంగా చలికాలం వచ్చింది అంటే చాలు గ్రామాలలో అందరూ ఒకచోట చేరి చలిమంటలు వేసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది.


 ఒకచోట మంట వేసుకొని చుట్టూ అందరూ కూర్చొని ఇక చలిమంటను ఎంజాయ్ చేస్తూ  ఉంటారు. ఇక సరదాగా ముచ్చట్లు పెడుతూ ఇక చలి నుంచి కాస్త ఉపశమనం పొందుతూ ఉంటారు. చలికాలంలో ప్రతి ఒక్కరికి నచ్చే విషయం ఏదైనా ఉంది అంటే ఇలా స్నేహితులతో కలిసి చలిమంట కాచుకుంటూ సరదాగా గడపడమే అని చెప్పాలి. అయితే ఇప్పుడు చలి తీవ్రత పెరిగిపోయిన నేపథ్యంలో గ్రామాల్లో అక్కడక్కడా ఇక ఇలాంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ వనికించే చలి నుండి కాస్త ఉపశమనం కలిగించే చలిమంట చివరికి ప్రాణం తీసేసింది.


 హైదరాబాద్లోని గురుమూర్తి నగర్ కు చెందిన సబియా బేగం అనే 39 ఏళ్ల మహిళ ఇటీవల చుట్టుపక్కల వారితో కలిసి బయట చలిమంట కాచుకుంటుంది. ఈ క్రమంలోనే సబియా బేగం చలిమంట దగ్గర కుర్చీలో కూర్చున్న సమయంలో ఆమె చీరకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. ఇక చూస్తూ చూస్తుండగానే మంటలు ఎక్కువయ్యాయి. దీంతో అక్కడున్న వారంతా మంటలు ఆర్పి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చివరికి సబియా బేగం మృతి చెందింది. ఇటీవల వికారాబాద్ జిల్లాలోనూ చలిమంట కాచుకుంటున్న సమయంలో ఓ వృద్ధురాలు  ఇలాగే మృత్యువాత పడింది. ఈ క్రమంలోనే చలిమంట నుంచి ఎంతో జాగ్రత్తగా ఉండాలని ఎంతోమంది అధికారులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: