సాధారణంగా ప్రేమ మనిషిని పిచ్చివాడిలా మారుస్తూ ఉంటుంది అని అందరూ అంటూ ఉంటారు. ఏకంగా ఈ లోకాన్ని సైతం మరిచిపోయేలా చేస్తూ ఉంటుంది అని చెబుతూ ఉంటారు. కొంతమంది ఏకంగా ప్రేమించిన వారు మోసం చేశారు అన్న కారణంతో ఏకంగా పిచ్చి వాళ్లలా ప్రవర్తించడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు అని చెప్పాలి. నేటి ఆధునిక సమాజంలో మాత్రం ప్రేమ ఎంతో మందిని నేరస్తులుగా మారుస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే చిత్ర విచిత్రమైన కారణాలతో ఎంతోమంది ఏకంగా దొంగతనాలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు.


 ప్రియురాలని ఇంప్రెస్స్ చేయడానికి ఖరీదైన గిఫ్టులు ఇవ్వాలి అనుకుంటున్నారు ఎంతోమంది యువకులు. అయితే స్తోమతకు మించిన బహుమతులు ఇవ్వాలి అని నిర్ణయించుకొని చివరికి డబ్బులు లేకపోవడంతో ఇక దొంగ తనాలకు పాల్పడుతూ పోలీసులకు దొరికిపోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి అని చెప్పాలి. ఇక్కడ ప్రేమ అతన్ని దొంగగా మార్చింది. ఏకంగా ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాడు సదరు యువకుడు. చివరికి డబ్బుల కోసం దొంగగా మారిపోయాడు అని చెప్పాలి.


 ఈ ఘటన అస్సాం లో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. దీపుంకర్ అనే వ్యక్తి  నోమో సుందర్ విల్సన్ గార్డెన్స్ లోని యూనియన్ బ్యాంక్ ఎటిఎం లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ ఉండేవాడు. అయితే ఇటీవల ఏటీఎంలో డబ్బులు నింపేందుకు వచ్చిన సిబ్బంది నమ్మకాన్ని సంపాదించి.. ఐడి పాస్వర్డ్ కూడా తెలుసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఏకంగా ఏటీఎంలో నుంచి 19.96 లక్షలు దొంగలించి చాపల్ ముక్ జిల్లాకు పారిపోయాడు. అక్కడ పోలీసులకు దొరక్కుండా తలదాచుకున్నాడు. కానీ సిసి కెమెరాల ఆధారంగా నిందితుని ట్రాక్ చేసిన పోలీసులు చివరికి అరెస్టు చేసి 14.2 లక్షల స్వాధీనం చేసుకున్నారు. ఎందుకు దొంగతనం చేశావని అడిగితే ప్రియురాలని పెళ్లి చేసుకునేందుకే ఇలాంటి పని చేసినట్లు ఒప్పుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: