ఇటీవల కాలంలో సినిమాలను తలపించే ఘటనలు అటు నిజజీవితంలో కూడా జరుగుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ఇలాంటి తరహా ఘటనలు ఏకంగా పోలీసులను సైతం అవాక్కయ్యేల చేస్తూ ఉన్నాయని చెప్పాలి. సాధారణంగా ఇప్పటివరకు మనం చాలా సినిమాల్లో చూసాం.. ఏకంగా జరగని హత్యను జరిగినట్లుగా సృష్టించి ఏకంగా కొంతమంది వ్యక్తులను జైలుకు పంపించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత హత్యకు గురయ్యారు అనుకున్న వ్యక్తులు ఇక జల్సాలు చేయడం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు ఇక ఇలాంటి సన్నివేశాలు ప్రేక్షకులలో ఉత్కంఠ పెంచితే మరికొన్నిసార్లు మాత్రం అందరికీ నవ్వులు తెప్పిస్తూ ఉంటాయి.


 ఇక ఇలాంటి ఘటనలను చూసినప్పుడు నిజజీవితంలో మాత్రం ఇలాంటి తరహా ఘటనలు జరగవు అని అందరూ భావిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా సినిమాను మించిన ఘటన జరిగింది అని చెప్పాలి. ఏకంగా భార్యను దారుణంగా హత్య చేశాడు అన్న ఆరోపణలతో భర్త జైలుకు వెళ్ళాడు. ఎన్నో రోజులు పాటు జైలు శిక్ష అనుభవించాడు. తర్వాత మళ్లీ తిరిగి విడుదలై ఇంటికి చేరుకున్నడు. కానీ ఇంటికి వచ్చిన భర్తకు షాకింగ్ సీన్ కనిపించింది. హత్యకుగురైంది అనుకున్న భార్య కాస్త చివరికి వేరొక వ్యక్తితో రాసలీలలు కొనసాగిస్తూ భర్తకు కనిపించింది.


 ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. భార్య మారుతి దేవిని హత్య చేశాడు అని ఆరోపణల పై భర్త సోను జైలుకు వెళ్లి 18 నెలల పాటు జైలు శిక్ష అనుభవించాడు. అనంతరం ఇక బెయిల్ పై బయటకు వచ్చాడు అని చెప్పాలి  అయితే హత్యకు గురైంది అనుకున్న భార్య కాస్త మరొకరితో రాసలీలలు గడుపుతూ ఉన్న విషయాన్ని భర్త సోను గమనించాడు. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని వెంటనే పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాడు సోను. ఈ క్రమంలోనే ఆర్తి దేవి కనిపించడంతో పోలీసులు సైతం షాక్ అయ్యారు. వెంటనే ఆమెను అరెస్టు చేశారు. అయితే అంతకుముందు ఆర్తి దేవి కనిపించకపోవడంతో భర్త పై కేసు నమోదు అయింది. దీనికి తోడు ఇక గుర్తు తెలియని శవాన్ని ఆర్తి దేవి మృతదేహమే అంటూ ఆమె తండ్రి కూడా అంగీకరించడంతో ఇక సోను పై కేసు నమోదు అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: