
ఒకవేళ జనాలు ఎవరైనా ఇదేంటని ప్రశ్నిస్తే.. కొంటె కొను లేకపోతే లేదు అని బెదిరించే వారు కూడా నేటి రోజుల్లో చాలామంది కనిపిస్తున్నారు. ఇక చాలామంది రైల్వే ప్రయాణాలు చేసే వారు ఇక కాస్త ఎక్కువ ధర చెప్పినప్పటికీ కూడా చేసేదేమీ లేక ఇక వాటర్ బాటిల్ లను కొనుగోలు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఐదు రూపాయలు ఎక్కువ ఇస్తే పోయేదేముందిలే అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక ప్రయాణికుడు మాత్రం ఇలా ఐదు రూపాయలు ఎక్కువగా వసూలు చేయడాన్ని సీరియస్‌గా తీసుకున్నాడు. రూల్స్ ప్రకారం ఎమ్మార్పీ ధరకే వాటర్ బాటిల్ అమ్మాలి.
కానీ అతను మాత్రం ఏకంగా ఐదు రూపాయలు ఎక్కువగా తీసుకున్నాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన సదరు రైల్వే ప్రయాణికుడు అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ రైల్వే కాంట్రాక్టర్ భారీ మొత్తంలో జరిమానా కట్టాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పాలి. హర్యానాకు చెందిన శివం బట్ అనే ప్రయాణికుడు లక్నో ఎక్స్ ప్రెస్ లో ప్రయాణం చేశాడు. చండీగఢ్ నుంచి షాజహాన్‌పూర్ కు వెళ్తున్న ఇతను మార్గమధ్యమంలో ఒక వాటర్ బాటిల్ కొనుగోలు చేయాలని అనుకున్నాడు. అయితే వాటర్ బాటిల్ పై ఎమ్మార్పీ ధర 15 రూపాయలు ఉండగా.. అతను మాత్రం 20 రూపాయలకు ఆ బాటిల్‌ను విక్రయిస్తూ ఉన్నాడు. ఇదేంటని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా జవాబు ఇచ్చాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన శివ వెంటనే వాటర్ బాటిల్ తీసుకున్నాడు. కానీ అక్కడ జరిగిన మొత్తాన్ని వీడియో తీసి రైల్వే అధికారులకు పంపించాడు. దీంతో రంగంలోకి దిగిన రైల్వే అధికారులు సదరు కాంట్రాక్టర్ కి ఏకంగా రూల్స్ అతిక్రమించినందుకు కానీ లక్ష రూపాయల జరిమానా విధించారు.