దేశ సరిహద్దుల్లో సైనికులు ఇక పక్క దేశాలు మన దేశ భూభాగాన్ని ఆక్రమించకుండా పహారా కాస్తూ ఉంటే.. ఇక దేశం నడిబొడ్డులో  శాంతిభద్రతలను నెలకొల్పేందుకు ఎంతో మంది పోలీసులు శ్రమిస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసు వృత్తి లోకి రావాలని ఎంతోమంది ఆశపడుతుంటారు. ఇలా పోలీస్ ఉద్యోగం సంపాదించాలని ఎంతోమంది ఇక ఏళ్ల తరబడి నిరీక్షణగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎంతో కష్టపడి పోలీసు ఉద్యోగం సాధించిన వారు ఇక సభ్య సమాజంలో శాంతిభద్రత నెలకొల్పడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉంటారు.


 సాధారణంగా పోలీసు ఉద్యోగాన్ని సాధించాలంటే మంచి చదువులు చదివి ఉండాలి. అలాంటిది ఇక ఐపీఎస్ అవ్వాలి అంటే ఎంత కష్టపడాలో అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఎనిమిదవ తరగతి చదివి ఏకంగా ఐపీఎస్ గా మారిపోయాడు. ఇంకో విషయం ఏమిటంటే కనీసం అతను ఎనిమిదవ తరగతి కూడా పాస్ కాలేదు. మధ్యలోనే చదువును ఆపేసాడు. అలాంటి వ్యక్తి ఐపీఎస్ గా మారిపోయి అందరిని ఆశపరిచాడు. అదేంటి ఎనిమిదవ తరగతి చదివిన వ్యక్తి ఐపీఎస్ ఎలా అవుతాడు ఇదేదో విడ్డూరంగా ఉంది అని అనుకుంటున్నారు కదా.


 నిజమే అతను ఎనిమిదవ తరగతి చదువుతూ ఐపీఎస్ అయ్యింది అఫీషియల్ గా కాదు అన్ అఫీషియల్ గా. 8వ తరగతి డ్రాప్ అవుట్ అయిన వ్యక్తి ఐపీఎస్ అవతారం ఎత్తి ఎంతో మందిని మోసం చేసి లక్షల రూపాయలు దోచుకున్నాడు. గ్వాలియర్ కు చెందిన వికాస్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్ల వద్ద చాయి దుకాణం నడుపుతూ ఉంటాడు. ఇక ఐపీఎస్ కావాలని కోరుకున్న వికాస్ బుగ్గ కారు ముందు ఫోటో దిగాడు. తర్వాత ఐపీఎస్ వికాస్ యాదవ్ గా మెయిల్ ఐడి క్రియేట్ చేశాడు. దీంతో తాను నిజంగానే ఐపీఎస్ అని సోషల్ మీడియా వేదికగా ఎంతో మందికి మాయమాటలు చెప్పి భారీగా డబ్బులు దండుకున్నాడు. ఇక ఇటీవల బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ips