అయితే ఇక ఇలా ఇటీవల కాలంలో ఏ ఏటీఎంలో చూసినా జనాలు కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నారు అని చెప్పాలి. అయితే ఏటీఎంలో ఎంత నగదు కావాలని టైప్ చేస్తే అంతే నగదు విత్డ్రా అవుతూ ఉంటుంది కానీ కొన్ని కొన్ని సార్లు ఏటీఎంలో సాంకేతిక లోపం కారణంగా ఏకంగా నోట్లో వర్షం కురవడం లాంటి ఘటనలు ఇప్పటివరకు ఎన్నోసార్లు వెలుగులోకి వచ్చాయి అన్న విషయం తెలిసిందే. హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో కూడా ఇలాంటి సీను రిపీట్ అయింది అని చెప్పాలి. ఇటీవల ఒక వినియోగదారునికి వింత అనుభవం ఎదురైంది అని చెప్పాలి.
ముందుగా ఎంతగానో మోరాయించి ఇబ్బంది పెట్టిన ఏటీఎం ఆ తర్వాత మాత్రం నోట్ల వర్షం కురిపించింది అని చెప్పాలి. ఏకంగా 500 రూపాయలు డ్రా చేస్తే ఏటీఎం నుంచి 2500 రూపాయలు వచ్చాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న అధికారులు ఇక ఏటీఎం వద్దకు ఎగపడ్డారు అని చెప్పాలి. ఏటీఎం నుంచి తమకు కావలసినంత డబ్బు డ్రా చేసుకొని అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఎప్పుడూ లేనంతగా సదరు ఏటీఎం దగ్గర జనాలు ఎగబడటం చూసిన సిబ్బందికి అనుమానం వచ్చింది. దీంతో వెంటనే బ్యాంకుకు సమాచారం అందించారు. పోలీసులతో పాటు బ్యాంకు సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి ఇక ఏటీఎంలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని పరిష్కరించారు అని చెప్పాలి.