
మహిళ కూడా ఎప్పటిలాగానే గ్రామానికి వచ్చి వీధి వీధి తిరుగుతూ ఇక పాడైపోయిన పాత బ్యాగులకు కొత్త జిప్పులు వేస్తాం అంటూ తిడుతూ ఉంది. ఇంతలో ఒక మహిళ ఆమెను తన ఇంటి వద్దకు పిలిచింది. ఈ క్రమంలోనే పాడైపోయిన బ్యాగులకు కొత్త జిప్పులు వేసింది సదర మహిళ. అయితే తర్వాత డబ్బులు తెస్తానంటూ సదరు ఇంటి యజమాని ఇంట్లోకి వెళ్ళింది. కానీ ఆ తర్వాత జిప్పులు వేయడానికి వచ్చిన మహిళా ఊహించని పని చేసింది. దీంతో ఇక బయటికి వచ్చిన ఇంటి యజమాని ఒక్కసారిగా షాక్ అయింది అని చెప్పాలి.
ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని ఓ గ్రామంలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. పాత బ్యాగులు జిప్పులు వేస్తామంటూ ఒక మహిళా గంగాదేవి వీధిలో అరుస్తూ తిరుగుతూ ఉంది. ఓ ఇంట్లో నుంచి బయటికి వచ్చిన మహిళ పాత బ్యాగ్ రిపేర్ చేయాలంటూ చెప్పింది. ఇక ఆ తర్వాత డబ్బులు తీసుకువచ్చేందుకు లోపలికి వెళ్ళింది. అయితే సదరు మహిళ డబ్బులు తీసుకొని బయటకి వచ్చేసరికి బ్యాగులు రిపేర్ చేసే మహిళ మొబైల్ ఫోన్ కూడా కనిపించకుండా పోయింది. చుట్టుపక్కల గాలించిన ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో బాధితురాలు వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.