ఇలా తమ అల్లుడు కూతురు కలకాలం పిల్ల పాపలతో ఎంతో సంతోషంగా ఉండాలని ఇక ఎవరైనా కోరుకుంటూ ఉంటారూ. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ఒక మామ అల్లుడిని వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఇక మామ వేధింపులు తట్టుకోలేకపోయిన అల్లుడు చివరికి ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇలా ఆ తండ్రి అల్లుడు వేదించి ఏకంగా కూతురికి పసుపు కుంకాలు తెగిపోయే పరిస్థితిని తీసుకొచ్చాడు అని చెప్పాలి. ఈ ఘటన ఎక్కడో కాదు నిజాంబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.
అప్పు చెల్లించాలంటూ మామ తరచూ అల్లుడిని వేధిస్తున్న నేపథ్యం లో ఇక మనస్థాపం చెందిన అల్లుడు చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. సందీప్ అనే వ్యక్తికి నవీపేట మండలం లో నాకు చెందిన ప్రియతో పెళ్లి జరిగింది. అయితే అల్లుడి వ్యాపారం కోసం మామ 5 లక్షల రూపాయల అప్పు ఇప్పించాడు మామ. కానీ వ్యాపారంలో నష్టాలు రావడం తో అల్లుడు సందీప్ దానిని తిరిగి చెల్లించలేక పోయాడు. ఈ క్రమం లోనే మరదలు పెళ్లికి వెళ్లిన సందీప్ ను అందరి ముందు మామ అప్పు గురించి నిలదీస్తూ అవమానించాడు. దీంతో పరువు పోయిందని జీర్ణించుకో లేక పోయినా అల్లుడు సందీప్ గోదావరి లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.