ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత రక్తసంబంధం ఉన్న బంధాలే చివరికి ఆ రక్తాన్నే కళ్ళ చూస్తున్న విధంగా మారిపోతున్నాయి అన్నది అర్థమవుతుంది. నావారు అనుకున్నవారు చివరికి ప్రాణాలను గాల్లో కలిపేస్తున్న ఘటనలు వెలుగు చూస్తూ ఉన్నాయి. వెరసి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది అని చెప్పాలి. చిన్నచిన్న కారణాలకే ఏకంగా సొంత వారి ప్రాణాలు తీస్తున్న మనుషులను చూసిన తర్వాత ఈ సభ్య సమాజంలో బ్రతుకుతుంది మానవత్వం ఉన్న మనుషులా లేకపోతే క్రూర మృగాల అన్నది కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది అని చెప్పాలి.


 ఎందుకంటే అడవుల్లో ఉండే క్రూర మృగాలు సైతం సాటి జంతువుల పట్ల కాస్తైన జాలీ దయ చూపిస్తాయేమో కానీ మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ అయిన మనిషి మాత్రం సొంత వారి విషయంలో రాక్షసత్వంతోనే ప్రవర్తిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇలా సొంత వారిని దారుణంగా హత్యలకు పాల్పడుతున్న ఘటనలు సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి. కొప్పల జిల్లాలో కూడా ఇలాంటి తరహా ఘటన జరిగింది. కుష్టికి తాలూకా పట్టల చింత గ్రామంలో తమ్ముడు అన్నను దారుణంగా హత్య చేశాడు. బసప్ప అనే వ్యక్తికి నలుగురు కుమారులు ఉన్నారు. యమనప్ప అనే పెద్ద కొడుకు కుటుంబ బాధ్యతలు మీద వేసుకొని ఇప్పటికే ఒకరికి పెళ్లి చేసి మరొక తమ్ముడికి వివాహం కూడా నిశ్చయం చేశాడు.


 ఈ క్రమంలోనే తనకు పెళ్లీడు వచ్చిన పెళ్లి సంబంధాలు చూడట్లేదని. అంతేకాకుండా ఆస్తి పంపకాలు కూడా చేయట్లేదు అంటూ ఇక పెద్దన్నయ్య యమునప్పపై తమ్ముడు మల్లప్ప కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల కఠిన నిర్ణయం తీసుకున్నాడు. దారుణంగా వేట కొడవలితో అన్నను నరికి హత్య చేశాడు. ఈ క్రమంలోని ఆ తర్వాత అక్కడ నుంచి పారారయ్యాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యమునప్ప శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక పరారిలో ఉన్న నిందితుడు మల్లప్పను అరెస్టు చేశారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: