
ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా అనుమ సముద్రంపేట రహమతుల్లా దర్గా ఇన్చార్జిగా ఉన్నాడు పాషా గులాం రక్షాబంది హఫీజ్ పాషా. అతనికి ఇద్దరు భార్యలు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే దయ్యాలు భూతాలు వదిలిస్తానంటూ పూజలు చేసి వచ్చిన డబ్బులతో జీవిస్తున్నాడు. అయితే కొంతకాలం క్రితం హైదరాబాద్ కి మాకామ్ మార్చాడు. అయితే ఇటీవల టోలిచౌకికి చెందిన యువతి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఇక కుటుంబ సభ్యులు రహమతుల్లా దర్గాకు ఆ యువతిని తీసుకెళ్లారు. అయితే యువతీకి దయ్యం పట్టింది అంటూ పాషా భయపెట్టాడు.
ఇక ఆ దయ్యం ప్రాణాలు తీసేంతవరకు వదలదని యువతి కుటుంబ సభ్యులను మరింత భయాందోళనకు గురిచేసాడు. ఇక ఆ దయ్యం వదిలించాలంటే తనకిచ్చి వివాహం చేయాలంటూ తేల్చి చెప్పాడు. వేరే దారి లేక యువతి కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు. అతడి ఆదేశాలతో ఒక ఫంక్షన్ హాల్ లో పెళ్లికి ఏర్పాట్లు చేశారు అయితే కుటుంబ సభ్యులు ఒకసారి అనుమానం వచ్చి ఆరా తీయగా అప్పటికే అతనికి రెండు పెళ్లిళ్లు జరిగాయని.. పిల్లలు కూడా ఉన్నారు అన్న విషయం బయటపడింది. దీంతో యువతితో సహా కుటుంబ సభ్యులందరూ కూడా పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా అతనిపై 2012లోనే ఒక మహిళను లోబరుచుకొ నిమోసం చేశాడు అంటూ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినట్లు విచారణలో బయటపడింది.