
ఆరడుగుల మనిషిని ఆరంగులాల నోటు నడిపిస్తుంది ఆడిస్తుంది పాడిస్తుంది. ఇక డబ్బు ఏం చెబితే మనిషి ఇప్పుడు అదే చేసేస్తూ ఉన్నాడు. ఏకంగా కనీ పెంచిన తల్లిదండ్రులను కూడా ఆస్తులు కోసం దారుణంగా హత్యలు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి దారుణమే జరిగింది. ఏకంగా సొంత అన్ననే తమ్ముడు దారుణంగా చంపేశాడు. ఇంటి అద్దె విషయంలో ఇద్దరి మధ్య మొదలైన వాగ్వాదం చివరికి ఒకరు ప్రాణం పోవడానికి కారణమైంది అని చెప్పాలి. తన చేతిలో ఉన్న చపాతీ కర్రతో తమ్ముడిని అన్న కొట్టాడు. దీంతో ఆవేశానికి గురైన తమ్ముడు అన్నను కత్తితో విచక్షణ రహితంగా పొడిచి చంపేశాడు.
ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గౌతమ్ నగర్ కమ్యూనిటీ హాల్లో అస్సాం కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఉంటున్నారు. అయితే ఇటీవల ఇంటి అద్దె చెల్లించే విషయంలో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. అయితే అన్న అంజన్ తమ్ముడు రంజన్ పైకి ఏకంగా చపాతీ కర్రను విసిరాడు. దీంతో తీవ్ర ఆవేశానికి లోనయ్యాడు రంజన్. అక్కడే ఉన్న కూరగాయల కత్తితో అన్న కడుపులో పొడిచాడు. దీంతో రక్తపు మడుగులో అన్న అంజన్ అక్కడికక్కడే చనిపోయాడు. ఘటపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.