
ఇక్కడ ఇలాంటిదే జరిగింది అని చెప్పాలి. సాధారణంగా తండ్రీ కూతుర్ల బంధం ఎంతో ప్రత్యేకమైనది అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే తన కూతురిలో తండ్రి తన అమ్మను చూసుకుంటాడని... అందుకే ఎంతమంది కొడుకులు ఉన్నా కూతురుని మాత్రం ప్రేమగా చూసుకుంటాడు అని చెబుతూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో కొంతమంది తండ్రులు మాత్రం పరువు కోసం ఏకంగా అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురుని చంపేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి ఓ పరువు హత్య జరిగింది.
నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఆలమూరుకు చెందిన దేవేంద్ర రెడ్డికి 21 ఏళ్ళ ప్రసన్న అనే కూతురు ఉంది. అయితే రెండేళ్ల క్రితం సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో ప్రసన్నకు పెళ్లి జరిగింది. అయితే ప్రసన్న పెళ్లికి ముందే మరో వ్యక్తిని ప్రేమించింది. అయితే పెళ్లి జరిగిన తర్వాత ప్రియుడి కోసం భర్తను వదిలేసి పుట్టింటికి వచ్చి ఇక్కడే ఉండిపోయింది. అయితే కాపురానికి వెళ్లాలి అంటూ తల్లిదండ్రులు ఎంత నచ్చజెప్పినా ప్రసన్న తీరులో మాత్రం మార్పు రాలేదు. దీంతో ఇక అందరి దగ్గర పరువు పోతుందని భావించిన దేవేంద్ర రెడ్డి.. కూతురుని దారుణంగా హత్య చేశాడు. తల మొండెం వేరు చేసి నల్లమల్ల అడవుల్లో పారేశాడు. అయితే ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అసలు నిజాలు రాబట్టారు అని చెప్పాలి.