
వెరసి కుక్క పేరు చెబితే చాలు ప్రస్తుతం బయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఇక రోడ్డు పక్కన కుక్కలు కనిపించాయి. అంతే చాలు ప్రతి ఒక్కరు కూడా ప్రాణాలను అరచేతిలో పట్టుకుని అటువైపు నుంచి రోడ్డు దాటుతున్న దుస్థితి కూడా కనిపిస్తుంది అని చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక కుక్కల నుంచి మనుషులకు భద్రత కల్పించేందుకు అటు అధికారులు కూడా చర్యలు చేపడుతున్నారు అని చెప్పాలి.
తెలంగాణ లోని చాలా ప్రాంతాల లో కుక్కలు స్వైర విహారం చేస్తూ మనుషుల పై దాడి చేసి తీవ్రం గా గాయపరుస్తున్న ఘటనలు ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇటీవల ఖమ్మం జిల్లా లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. బోనకల్లో కుక్కలు స్వైర విహారం చేశాయి. ఏకంగా ఐదేళ్ల చిన్నారి జశ్వితపై వీధి కుక్కలు దాడి చేయడంతో ఆమె కంటికి తీవ్ర గాయాలు అయ్యాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే చిన్నారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు కుటుంబ సభ్యులు. ఈ ఘటన కాస్త అందరిలో భయాందోళన పెంచింది అని చెప్పాలి.