ఏకంగా పిల్లలను రక్షించుకోవడం కోసం తల్లి మరణంతో కూడా పోరాడుతుంది అన్న విషయం ఇక మరోమారు నిజమైంది అని చెప్పాలి. ఏకంగా 11 ఏళ్ల కుమార్తె ప్రాణాలను కాపాడేందుకు అడవిపంది రూపంలో దూసుకు వచ్చిన మృత్యువుతో పోరాడింది. అడవి పంది ని ఎదిరించి కూతురిని కాపాడుకుంది. కానీ ఇలా కూతురుని కాపాడే క్రమంలో తీవ్రంగా గాయాల పాలైన సదరు మహిళ.. చివరికి ప్రాణాలు కోల్పోయింది. కోర్బా లోని పాసన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 45 ఏళ్ళ దువాసియా భాయి ఇటీవలే పొలానికి వెళ్ళింది. పొలంలో మట్టి తీసె పనులు చేస్తుండగా హఠాత్తుగా ఎక్కడి నుంచి వచ్చిందో కానీ అడవి పంది దూసుకొచ్చి కుమార్తె పై దాడి చేసింది.
దీంతో అపర కాలిలా మారిన తల్లి దువాశీయా భాయి తన చేతిలో ఉన్న గొడ్డలితో ఏకంగా అడవి పందిపై ప్రతి దాడికి దిగింది. ఈ క్రమంలోనే అడవి పంది చనిపోయింది. అయితే అడవి పంది తో పోరాటంలో అటు దువాషియ బాయి కూడా తీవ్రంగా గాయపడి ప్రాణాలు వదిలింది. ఈ క్రమంలోనే క్రూర మృగాల దాడి కింద బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇస్తామని అటవీ రేంజ్ అధికారులు చెప్పుకొచ్చారు. తొలుత 25000 చెల్లిస్తామని.. ఇక అన్ని ఫార్మాలిటీలు ముగించిన తర్వాత 5.75 లక్షల ఎక్స్ గ్రేషియా అందిస్తాము అంటూ అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనంగా మారిపోయింది.