సాధారణంగా ఒక వ్యక్తికి ఉన్నఫలంగా అదృష్టం వరించింది అనుకోండి.. అదృష్టవంతుడివి అంటే నీవే రా బాబు.. నక్క తోక తొక్కినట్టున్నావ్ అని ఒక సామెత చెబుతూ ఉంటారు అందరూ. అయితే ఇలా నక్క తోక తొక్కాడు అంటే అతనికి అదృష్టం వరించింది అని అర్థం వస్తూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇక ఈ సామెతను నిజం చేయాలి అనుకున్నాడు ఇక్కడ ఒక వ్యక్తి. ఏకంగా తనకు అదృష్టం వరించాలి అనే ఉద్దేశంతో అడవిలోకి వెళ్లి ఒక నక్కను తీసుకొచ్చి ఒక బోన్ లో పెట్టి రోజు దాని మొఖం చూడటం మొదలు పెట్టాడు.
సామెతలో చెప్పినట్లుగానే అతనికి అదృష్టం కూడా వరించింది అని చెప్పాలి. కానీ చివరికి అతను జైలు పాలు కావలసిన పరిస్థితి ఏర్పడింది. కర్ణాటకలోని తుముకూరుకు చెందిన లక్ష్మీకాంత్ అనే వ్యాపారి నక్కతోక తొక్కడం అనే సామెతను నమ్మాడు. అడవిలోకి వెళ్లి ఓ నక్కను తెచ్చి తన కోళ్ల ఫామ్ లోని బోనులో పెట్టాడు. రోజు దాన్ని చూస్తుండడంతో అదృష్టం వరించింది. డబ్బులు వర్షం కురిసింది. కానీ యానిమల్ యాక్ట్ ప్రకారం జంతువులను బంధించడం నిషేధం దీంతో చివరికి జైలు పాలు అయ్యాడు. ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనగా మారిపోయింది అని చెప్పాలి.