కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత వైద్యుల వ్యాల్యూ ఏంటి అన్న విషయం ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది అని చెప్పాలి. అప్పటి వరకు వైద్యులు అంటే కేవలం డబ్బులు గుంజడం మాత్రమే చేస్తారు అనే భావన కొంతమందిలో ఉండేది. కానీ కరోనా వైరస్ వెలుగులోకి వచ్చాక అందరూ భయపడిపోయి తాము బాగుంటే చాలు అనుకుని ఇంటి నుండి కాలు బయట పెట్టకుండా ఉన్న సమయంలో.. కరోనా వైరస్ బారిన పడిన వారిని రక్షించేందుకు కుటుంబాలకు దూరంగా ఉండి మరి ప్రాణాలకు తెగించి సేవలు చేశారు వైద్యులు.


 ఈ క్రమంలోనే వైద్యుల పై ఉన్న గౌరవం అందరిలో కూడా మరింత పెరిగిపోయింది. ఇక ఇప్పటికి కూడా వైద్యులను కలియుగ దైవంగానే భావిస్తూ ఉన్నారు ఎంతోమంది జనాలు. అయితే ఇలాంటి సమయంలో కొంతమంది వైద్యులు మాత్రం ఏకంగా గౌరవప్రదమైన డాక్టర్ వృత్తికే కళంకం తెచ్చే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రిలో కొంతమంది వైద్యులు నిర్లక్ష్యంగా చికిత్స చేస్తూ ఉండడం మాత్రం అక్కడికి వచ్చిన పేషెంట్లకు ప్రాణాలు పోయే పరిస్థితిని తీసుకువస్తూ ఉంది అని చెప్పాలి. ఇక ఇటీవల సిద్దిపేట ప్రభుత్వాసుపత్రిలో కూడా ఇలాంటి ఒక విషాదకర ఘటన జరిగింది.


 వైద్యుల నిర్లక్ష్యం చివరికి శిశువు ప్రాణం పోయే పరిస్థితిని తీసుకువచ్చింది. తల్లి గర్భంలోనే శిశువు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేటకు చెందిన నాగలక్ష్మి ఇటీవల కాన్పు కోసం సిద్దిపేట జిల్లా ఆసుపత్రికి వచ్చింది. అయితే రెండుసార్లు స్కానింగ్ చేసి బిడ్డ బాగుందని వైద్యులు చెప్పారు. కానీ మూడోసారి స్కానింగ్ చేయడంతో బేబీ హార్ట్ బీట్ తగ్గిందని చెప్పారు. అయితే ఇలా డాక్టర్లు చెప్పిన కొద్దిసేపటికి గర్భంలోనే శిశువు మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందని కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: