
ఇప్పటికే ఎన్నో రకాల వైరస్లు ముంచుకొస్తూ మనుషుల ప్రాణాలను తీస్తుంటే.. మరోవైపు రోడ్డు ప్రమాదాలు కారణంగా మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంకోవైపు సడన్ హార్ట్ ఎటాక్ లు క్షణాల వ్యవధిలో చూస్తుండగానే మనిషి ప్రాణాన్ని తీసేస్తున్నాయని చెప్పాలి. నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరిలో ప్రాణ తీపి పెరిగిపోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ ఒక వ్యక్తి ప్రాణం గాల్లోంచి గాల్లోనే కలిసిపోయింది అని చెప్పాలి విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయాడు.
ఢిల్లీ నుంచి దోహా కు ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్నాడు ఒక వ్యక్తి. ఆ ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు అని చెప్పాలి. దీంతో గమనించిన విమాన సిబ్బంది వెంటనే పాకిస్తాన్లోని ఖరాచీలో అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేశారు. అయితే వైద్యులు వెంటనే అక్కడికి చేరుకొని అతని పరీక్షించారు. కాగా సదరు ప్రయాణికుడు అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు అని వైద్యులు ప్రకటించారు. దీంతో మృతదేహంతో సహా విమానం మళ్ళీ ఢిల్లీకి తిరిగి వచ్చింది. అయితే మృతుడు నైజీరియాకు చెందిన 60 ఏళ్ల అబ్దుల్లాగా గుర్తించారు అధికారులు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులకు అతని మృతదేహాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు అని చెప్పాలి. ఈ ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది.