
ఏ కష్టం రాకుండా సంతోషంగా చూసుకుంటాడు అనుకున్న భర్త అనుమానించడం మొదలుపెట్టాడు. దీంతో తరచూ వేధింపులకు గురి చేస్తూ ఉండేవాడు. వేధింపులు తట్టుకోలేకపోయిన వివాహిత చివరికి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మచిలీపట్నంలోని చిలకలపూడి పోలీస్ స్టేషన్లో వెలుగు చూసింది. 22 ఏళ్ల లిఖితకు కోడూరు మండలం హంసలదీకి చెందిన గోపాలకృష్ణతో గత ఏడాది ఏప్రిల్ లో వివాహం జరిగింది. మచిలీపట్నంలోని ఈడేపల్లిలో ఇక ఈ దంపతులు కాపురం పెట్టారు. కొన్నాళ్ళ వరకు అంతా సాఫీగానే సాగిపోయింది.
కానీ ఆ తర్వాత భర్త గోపాలకృష్ణ ఏదో ఒక విషయంపై గొడవ తీస్తూనే ఉండేవాడు. ఉద్యోగం చేయకుండా ఖాళీగా ఉండడమే కాక.. భార్యను అనుమానించడం మొదలు పెట్టాడు. ఇక కుటుంబ పోషణ పట్టించుకోకుండా తిరగడమె కాదు భార్య ఉద్యోగం చేస్తూ ఉంటే మానసికంగా సూటిపోటి మాటలతో వేధిస్తూ ఉండేవాడు. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఇక ఇటీవల ఇలాగే గొడవ జరగడంతో మనస్థాపానికి గురైన లిఖిత ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పై లిఖిత తల్లి ఫిర్యాదు మేరకు కేస్ నమోదు చేసుకున్న పోలీసులు గోపాలకృష్ణను అదుపులోకి తీసుకున్నారు.