ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మనుషుల్లో మానవత్వం అనేది పూర్తిగా చచ్చిపోయిందేమో అని అనుమానం ప్రతి ఒక్కరిలో కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే సాటి మనిషికి ఏదైనా అపాయం వచ్చినప్పుడు అయ్యో పాపం అంటూ జాలి పడే మనుషులు నేటి రోజుల్లో ఎక్కడ కనిపించడం లేదు అని చెప్పాలి. చిన్న చిన్న  కారణాలకే మానవ మృగాలుగా మారిపోతూ ఇతరులపై దారుణంగా దాడి చేస్తున్న ఘటనలే ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్నాయ్. వెరసి ఇలాంటి తరహా ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా భయాందోళనకు గురి చేస్తూ ఉన్నాయ్ అని చెప్పాలి.



 ఎప్పుడు ఎవరు ఎటువైపు నుంచి దాడి చేస్తారో కూడా తెలియక ప్రతి ఒక్కరు భయం భయంగానే బ్రతికేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ట్రాన్స్ పోర్ట్ కంపెనీలో మేనేజర్ గా పని చేస్తున్న వ్యక్తిని ఒక పోల్ కు కట్టేసి కొంతమంది వ్యక్తులు దారుణంగా రాడ్డుతో చావగొట్టారు అని చెప్పాలి. ఇక ఆ తర్వాత చనిపోయిన మేనేజర్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి ముందు పడేసి పరారయ్యారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. షాజహాన్ పూర్ లో బంకింగ్ సూరి అనే ట్రాన్స్ పోర్ట్  లో వ్యాపారవేత శివం జోలి అనే వ్యక్తి గత ఏదేళ్లుగా మేనేజర్ గా పనిచేస్తున్నాడు. అయితే కన్హియ హోజరికి చెందిన ఓ పార్సిల్ కనిపించడం లేదని నెపంతో మేనేజర్ పై దొంగతనం ఆరోపణలు కూడా వచ్చాయి.



 మేనేజర్ శివంపై కనిహియా హోసరీ కంపెనీ యజమాని నీరజ్ గుప్తా తో పాటు మరో ఆరుగురు కూడా దారుణంగా దాడి చేశారు. బాధితుడుని పోల్ కి కట్టేసి రాడ్డుతో విచక్షణ రహితంగా కొట్టారు. దీంతో దెబ్బలు తాళలేకపోయిన శివం చివరికి మృత్యువాత పడ్డాడు అని చెప్పాలి. తర్వాత అతని మృతదేహాన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ముందు పడేశారు. అనంతరం కరెంట్ షాక్ తో చనిపోయినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే మృతుడి కుటుంబ సభ్యులకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక పోస్టుమార్టం రిపోర్టులో శరీరంపై దారుణంగా గాయాలు ఉన్నట్లు తెలిసింది. ఇక తర్వాత ఒక వీడియో వెలుగులోకి రావడంతో అసలు విషయం పోలీసులకు అర్థమైంది. నిందితులను అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: