ఇటీవల కాలంలో ట్రాఫిక్ పోలీసులు వాహనదారుల విషయంలో ఎంత కఠినంగా ఉంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు సరైన ఆధారాలు లేకుండా వాహనాలు నడిపిన చూసి చూడనట్లుగా వ్యవహరించేవారు పోలీసులు. కానీ ఇప్పటికక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తూ నిబంధనలను ఉల్లంఘించిన వారికి ఆన్లైన్లోనే జరిమానాలు వేస్తున్నారు. ఇక మరికొన్ని చోట్ల తనిఖీలు నిర్వహిస్తూ సరైన పత్రాలు లేకపోతే జరిమానాలు విధించడమే కాదు జైలు శిక్ష కూడా విధిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి.


 దీంతో వాహనదారులు జరిమానాల నుంచి తప్పించుకోలేక ఇక జేబుకు చిల్లుపడే జరిమాణాలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ట్రాఫిక్ పోలీసులు ఇలాగే ఒక జరిమానా విధించారు. ఈ చలాన్ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. హెల్మెట్ పెట్టుకోలేదని జరిమానా వేశారు. హెల్మెట్ పెట్టుకోకపోతే ఎక్కడైనా ఫైన్ వేస్తారు. ఇందులో కొత్త ఏముంది అనుకుంటున్నారు కదా. అయితే హెల్మెట్ పెట్టుకోలేదని జరిమానా వేసింది బైక్ నడుపుతున్న వ్యక్తికి కాదు కారు నడుపుతున్న వ్యక్తికి.



 హమీర్పూర్ జిల్లాలో ఈ ఘటన వెలుగు లోకి వచ్చింది. ముస్కార పట్టణం లోని ఓ ప్రాంతానికి చెందిన పవన్ కుమార్ కారు లో వార్తాపత్రికలను సరఫరా చేసి తిరిగి ఇంటికి వస్తున్నాడు. అయితే ట్రాఫిక్ పోలీసులు అతన్ని ఆపారు. విధుల్లో ఉన్న స్టేషన్ ఇన్స్పెక్టర్ నందకిషోర్ యాదవ్ కారు ఫోటో తీసి ₹1000 చలానా విధించారు. ఫైన్ ఎందుకు అంటూ ప్రశ్నిస్తే హెల్మెట్ పెట్టుకోనందుకు ట్రాఫిక్ సిబ్బంది సమాధానం ఇచ్చారు. పవన్ మొబైల్ కి చాలాన్ కు సంబంధించిన సందేశం వచ్చింది. ఇక దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అతను కారు డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోవడం ఏంటి అంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో స్పందించిన అధికారులు చలాన్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి పంపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: