ప్రేమ అనేది ఎన్నో మధురానుభూతుల సమ్మేళనం అని అంటూ ఉంటారు. అయితే ఇలాంటి డైలాగులు కేవలం సినిమాలకు మాత్రమే సరిపోతున్నాయి. కానీ నిజజీవితంలో మాత్రం ఇలాంటివి ఎక్కడ కనిపించడం లేదు. అయితే ప్రేమ అంటే మధురానుభూతి ఏమో కానీ.. ప్రేమ పేరుతో జరుగుతున్న దారుణాలు మాత్రం రోజురోజుకు పెరిగిపోతున్నాయి అని చెప్పాలి. తమను ప్రేమించాలి అంటూ వెంట పడటం నువ్వు లేకుండా బ్రతకలేను అంటూ మాయమాటలు చెప్పడం చేస్తున్నారు ఎంతో మంది యువకులు.



 ఒకవేళ యువతి ప్రేమను నిరాకరించింది అంటే చాలు నువ్వు లేకుండా బ్రతకలేను అని చెప్పిన వారే.. చివరికి ప్రాణాలు తీసేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలా ఇటీవల కాలంలో ప్రేమున్మాదులు  రెచ్చిపోతున్న తీరు ప్రతి ఒక్కరిలో కూడా భయాన్ని కలిగిస్తూ ఉంది. ఏకంగా సినిమాల్లో చూపించినట్లుగా కాదు అంతకుమించి అనే రేంజ్ లోనే ప్రేమోన్మాధులు  రెచ్చిపోయి దాడులకు పాల్పడుతూ ఉన్నారు. ఇక ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లాలో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఏకంగా రెచ్చిపోయిన యువకుడు ఒక విద్యార్థినిపై సలసలా కాగుతున్న నూనె పోసాడు.


 పెదవేగి మండలం దుగ్గిరాలలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో ఇంజనీరింగ్ విద్యార్థిని ఓ యువకుడు బంధించి చిత్రహింసలు పెట్టాడు. ఆమెపై వేడి నూనె పోసి సైకో లాగా ప్రవర్తించాడు. ఆ దుర్మార్గుడి నుంచి ఎలాగోలా తప్పించుకున్న యువతి చివరికి పేరెంట్స్ కి సమాచారం అందించింది. అయితే తీవ్ర గాయాల పాలైన సదరు యువతీని ఏలూరు ప్రభుత్వాసుపత్రికీ తరలించారు. ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం యువతి షాక్ లో ఉండడంతో పోలీసులు ఆమె దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకోలేదు. షాప్ నుంచి తేరుకున్నాక ఇక నిందితుడు ఎవరు అనే విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: