
ప్రియుడు తండ్రితో లేచిపోవడమేంటి.. ఆమె ప్రేమించింది యువకుడిని కదా అనుకుంటున్నారు కదా.. ఆ ప్రియుడికి కూడా ఇలాంటి అనుమానమే కలిగింది. కాన్పూర్ లో ఈ ఘటన వెలుగు చూసింది. కమలేష్ అనే వ్యక్తి కి 21 ఏళ్ళ అమిత్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే అమిత్ ఖాన్పూర్ లో ఉంటున్న ఒక యువతిని ప్రేమిస్తున్నాడు. యువతి కూడా అమిత్ ను ఎంతో గాఢంగా ప్రేమించింది.. రెండేళ్ల పాటు సినిమాలు షికార్లు అంటూ ప్రేమలో మునిగి తేలింది ఈ జంట. వీరి ప్రేమ వ్యవహారం ఇద్దరి కుటుంబాల్లో తెలిసింది.
అయితే రెండు కుటుంబాలు పెళ్లికి వ్యతిరేకించకపోయిన చిన్న వయసులో పెళ్లి ఎందుకు కొన్నాళ్లు ఆగుదాం అంటూ నిర్ణయించుకున్నారు. ఇదే విషయం యువతి తల్లిదండ్రులు అమిత్ తండ్రి కమలేష్ కు చెప్పారు. అయితే ఓ రోజు అమిత్ తన ప్రియురాలని ఇంటికి పిలిపించుకున్నాడు. అయితే ఇలా ఇంటికి వచ్చి వెళుతున్న యువతి కాబోయే మామ కమలేష్ తో కూడా ఎక్కువగా మాట్లాడటం మొదలుపెట్టింది. అయితే ఇటీవలే ప్రియురాలితో రాత్రి మాట్లాడి పడుకున్న అమిత్ కు పొద్దున లేచే సరికి ఊహించని షాక్ తగిలింది. తన తండ్రి కమలేష్ తో కలిసి ప్రియురాలు లేచిపోయిందని విషయం తెలుసుకుని హడలిపోయాడు. కుటుంబ సభ్యులు కూడా షాకై యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పారిపోయిన జంటను అదుపులోకి తీసుకున్నారు. యువతికి ప్రస్తుతం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.