మనం సినిమాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం . ఎక్కడో ఉన్న ప్రియురాలిని కలవడానికి హీరోలు విన్యాసాలు చేస్తూ ఉంటారు. అర్ధరాత్రి ప్రియురాలు ఇంటికి వెళ్లి రొమాన్స్ చేయడం కూడా సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. అయితే నిజ జీవితంలో మేం హీరోలకి ఎక్కడ తక్కువ కాదు అనుకునే కొంతమంది యువకులు ఇలాంటి చేస్తూ ఉంటారు. అర్ధరాత్రి సమయంలో ఏకంగా ప్రియురాలి ఇంటికి వెళ్లి ఎంజాయ్ చేయాలని అనుకుంటూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు అనుకున్నట్లుగానే ఇక ప్రియురాలితో కలిసి మళ్లీ సేఫ్ గానే ఇంటికి తిరిగి వస్తే.. మరి కొన్నిసార్లు మాత్రం ఇంట్లో వాళ్లకు దొరికిపోయి చివరికి దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటారు. ఇక్కడ ఒక యువకుడికి ఇలాంటి చేదు అనుభవము ఎదురైంది.



 బీహార్ లో జరిగిన హై వోల్టేజ్ లవ్ డ్రామాకు గ్రామస్తులు చివరికి పెళ్లితో ముగింపు పలికారు. చన్ పాటీయా బ్లాక్ లోని గిద్ద పంచాయితీ చౌరహియకు చెందిన రంజన్ కుమార్ యాదవ్, లౌకారియా గ్రామానికి చెందిన ఊర్మిళ అనే యువతిని ప్రేమించాడు.  ప్రియురాలిని కలిసేందుకు   రాత్రి వేళ ఆమె ఇంటికి వెళ్ళాడు. ఇక ఇద్దరు సీక్రెట్ గా కలుసుకున్న సమయంలో యువతి కుటుంబ సభ్యులు వీరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇక వెంటనే పెళ్లి చేసుకోమని కుటుంబ సభ్యులు గ్రామస్తులు అందరూ కూడా యువకుడిని నిలదీశారు.



 అయితే ఇక వారి కళ్ళు కప్పి రంజన్ కుమార్ యాదవ్ ఎలాగైనా అక్కడి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించాడు. దీంతో ఇక ఇరు వర్గాల మధ్య చర్చల నేపథ్యంలో అక్కడ అర్ధరాత్రి మొత్తం హైడ్రామా నడిచింది అని చెప్పాలి.  చివరికి ఇద్దరినీ కూడా పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే పోలీసులు ఇక రంజన్ కుమార్, ఊర్మిలకు పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని లిఖిత  పూర్వక హామీ తీసుకున్నారు. ఇక ఎట్టకేలకు వీరిద్దరికి పెళ్లి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: