ఈ భూమ్మీద నూకలు తినే భాగ్యం ఉండాలి కానీ ఎలాంటి ప్రమాదం నుంచి అయినా బయటపడతారు అని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ఇటీవల కాలం లో ఇది నిజమే నిరూపించే ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రాణాలు పోయే పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి చిన్న గాయం కూడా కాకుండా ఎంతోమంది బయటపడుతూ ఉంటారు. అదే సమయంలో ఈ భూమి మీద నూకలు తినే భాగ్యం లేకపోతే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఏదో ఒక విధంగా ప్రాణాలు పోతాయి. ఇక ప్రాణాలు పోయేంతవరకు కూడా మృత్యువు వెంటాడుతూనే ఉంటుంది అనేదానికి ఉదాహరణగా కూడా ఎన్నో ఘటనలు వెలుగులోకి వచ్చాయ్.



 ఇక ఇప్పుడు ఒక యువతి విషయంలో ఇదే నిజం అయింది. ఎందుకంటే ఏకంగా బ్రెయిన్ సర్జరీ నుంచి కోలుకుని మృత్యుంజయురాలిగా మారిపోయిన యువతిని చివరికి మృత్యువు వెంటాడిన మరో సమస్య రూపంలో ముంచుకొచ్చి ప్రాణాలు తీసేసింది. దీంతో ఇక కూతురు బ్రతికింది అన్న ఆనందం అటు తల్లిదండ్రులకు లేకుండా పోయింది అని చెప్పాలి. ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. కంగ్టి ప్రాంతానికి చెందిన  సురేఖ అనే యువతి మృత్యువుతో పోరాడి చివరికి ఓడిపోయింది.



 సురేఖకు బ్రెయిన్ లో ట్యూమర్ ఏర్పడింది  దీంతో ఆ ట్యూమర్ ప్రాణాంతకంగా మారిపోయింది. ఆపరేషన్ చేస్తే తప్ప బతకలేని పరిస్థితి ఏర్పడింది. అయితే కుటుంబ సభ్యులు లకు అటు ఆపరేషన్ చేయించే స్తోమత లేదు. దీంతో ఆపన్న హస్తం కోసం వేడుకోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే వారికి సురేఖ ఆపరేషన్ కోసం రెండు లక్షల రూపాయల విరాళాలు వచ్చాయి. వచ్చిన డబ్బుతో ఆపరేషన్ చేయించగా బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ విజయవంతం అయింది. కానీ చివరికి కిడ్నీ సమస్య రావడంతో ప్రాణాలు వదిలింది సురేఖ.దీంతో తల్లిదండ్రులు అరణ్య రోదనగా విలపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: