
ఈ క్రమం లోనే ఈ బెట్టింగ్ మాఫియా మాయ లో పడి ఎంతో మంది యువకులు జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఇక కొంత మంది చివరికి సూసైడ్ చేసుకునే పరిస్థితులను కూడా కొనితెచ్చుకుంటున్నారు. అయితే ఇటీవల కాలంలో బెట్టింగ్ మాఫియాల పై అటు పోలీసులు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేస్తున్నప్పటికీ పోలీసులకు చిక్కకుండా బెట్టింగ్ మాఫియా ఇక రహస్యం గా బెట్టింగ్లకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు లోకి వస్తున్నాయి. ఇక్కడ బెట్టింగ్ మాఫియా ఏకంగా మరో యువకుడి ప్రాణాన్ని బలి తీసుకుంది.
రంగారెడ్డి జిల్లా లో ఈ ఘటన వెలుగు లోకి వచ్చింది అని చెప్పాలి. బెట్టింగ్ మాయ లో పడి పోయిన సదరు యువకుడు ఎన్నో అప్పులు చేశాడు చివరికి బెట్టింగ్ డబ్బులు చెల్లించేందుకు ఎలాంటి మార్గం కనిపించ లేదు. దీంతో ఆత్మహత్య ఒక్కటే మార్గం అనుకున్నాడు. చివరికి ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. ఫరూక్నగర్ మండలం నార్లగడ్డ తాండాకు చెందిన ప్రకాష్ ఇటీవల పంజాబ్,ఢిల్లీ మ్యాచ్ పై బెట్టింగ్ చేశాడు. బెట్టింగ్ డబ్బుల కోసం మిత్రులు అతనిపై ఒత్తిడి తీసుకు రాగా.. మనస్తాపం చెందిన ప్రకాష్ చివరికి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.