
అయితే ఇలా ఆడపిల్లలపై అత్యాచారాలు చేసిన వారిని కోర్టులు కఠినంగా శిక్షిస్తున్నప్పటికీ కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. మరి కొంతమంది ఏకంగా వావి వరసలు మరిచిపోయి మరి సొంత వారి పైన అత్యాచారాలు చేస్తున్న ఘటనలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఒక నీచుడు ఏకంగా బాలిక పాలిట కాలయముడిగా మారిపోయాడు. వరసకు అతను బాబాయ్ అవుతాడు. బాబాయ్ అంటే తండ్రి తర్వాత తండ్రి లాంటివాడు. కానీ ఏకంగా అన్న కూతురు మీదే కన్నేసాడు ఆ నీచుడు.
ఈ ఘటన హైదరాబాద్ నగరం లోని పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి వద్ద అతని సోదరుడి ఇద్దరు కూతుర్లు ఉంటున్నారు. వీరి చిన్న తనం లోనే తల్లిదండ్రులు విడిపోగా బాలికల తల్లి వేరే రాష్ట్రంలో ఉంటుంది. ఇటీవలే కూతుర్లను చూసేందుకు వచ్చింది తల్లి. ఈ క్రమంలోనే కూతుర్లతో మాట్లాడగా.. ఆరు నెలల నుంచి చిన్నాన్న తమతో అసభ్యంగా ప్రవర్తించాడని.. ఏడుస్తూ బాలికలు తల్లికి తెలిపారు. ఈ క్రమంలోనే షాక్ అయిన తల్లి వెంటనే పోలీస్ స్టేషన్లో ఈ ఘటనపై ఫిర్యాదు చేసింది. ఇక నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..