ఆధునిక జీవనశైలికి అలవాటు పడిన మనిషి మానవత్వాన్ని మాత్రం పూర్తిగా మరిచిపోతున్నాడు. వెరసి ఇక సాటి మనుషుల విషయంలో అత్యంత పైశాచికంగా ప్రవర్తిస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. సాటి మనుషుల ప్రాణాలు తీయడానికి కాస్తయినా వెనక ముందు ఆలోచించడం లేదు మనిషి. వెరసి ఇక దారుణ హత్యలకు పాల్పడుతున్న ఘటనలు అందరిని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయ్. ఇక ఇటీవల గయానాలో కూడా ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రభుత్వ స్కూల్ హాస్టల్ లో అగ్ని ప్రమాదం జరిగి 19 మంది చనిపోయిన ఘటనలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.
అయితే అసలు విషయాలు తెలిసి అటు పోలీసులు సైతం నివ్వెర పోయారు అని చెప్పాలి. హాస్టల్లో ఉండే 14 ఏళ్ల విద్యార్థిని ఈ దారుణానికి పాల్పడి 19 మంది మరణానికి కారణమైంది అన్న విషయం ఇక పోలీసులు తమ విచారణలో తేల్చారు. ఒక వృద్ధుడితో 14 ఏళ్ల విద్యార్థి సంబంధం కలిగి ఉందట. అయితే హాస్టల్ నిర్వాహకులకు ఈ విషయం తెలిసి.. ఇక మిగతా పిల్లలు చెడిపోవద్దు అనే ఉద్దేశంతో ఆమె ఫోన్ సీజ్ చేశారట. దీంతో కోపంతో రగిలిపోయిన ఆ విద్యార్థిని తెల్లవారుజామున విద్యార్థులు అందరూ నిద్రపోతున్న సమయంలో ఇక గదికి నిప్పంటించింది. ఈ విషయం పోలీస్ విచారణలో ఆ బాలిక అంగీకరించింది.