నేటి రోజుల్లో మనీకి ఉన్న వాల్యూ మానవ బంధాలకు అస్సలు లేదు అన్న విషయం తెలిసిందే. అంతేకాదు డబ్బులు కోసం మనిషి ఏం చేయడానికి అయినా సిద్ధపడుతున్నాడు. ఇక రక్తం పంచుకుని పుట్టిన వారిని సైతం దారుణంగా కడతేర్చేందుకు వెనకడుగు వేయని పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పాలి. ఇక్కడ డబ్బు ఏకంగా ఒక యువతి జీవితాన్ని నాశనం చేసింది అని చెప్పాలి. అవసరానికి యువతి తీసుకున్న 2000 రూపాయలు చివరికి ఒక దారుణానికి కారణమైంది. అవసరాన్ని ఆసరాగా తీసుకుని ఒక వ్యక్తి యువతిని దారుణంగా మోసం చేసాడు.


 ఏకంగా పలుమార్లు లైంగిక దాడి పాల్పడ్డాడు. ఈ ఘటన ఎక్కడో కాదు హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది. స్నేహితుడిని నమ్మి చివరికి నట్టేట్లో మునిగింది యువతి. హైదరాబాద్ కు చెందిన యువతికి చెన్నైకి చెందిన పూర్ణేష్ యాదవ్ కు 7 నెలల క్రితం ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమ దాకా వెళ్ళింది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ ఇటీవలే తనకు డబ్బులు అవసరం ఉన్నాయి అంటూ చెన్నైలోని బాయ్ ఫ్రెండ్ పూర్ణేష్ కోరాడు. అయితే తన ప్రియుడికి సహాయం చేయాలి అనే ఉద్దేశంతో యువతి తన స్నేహితుడైన అస్లాంను ఆశ్రయించింది.


 అయితే యువతి అవసరాన్ని తనకు ఆసరాగా మార్చుకున్నాడు అస్లాం. తన దగ్గర డబ్బులు లేవని అయితే తన స్నేహితుడు సాయిచరణ్ ఎంత డబ్బు అయినా ఇస్తాడని.. కానీ నువ్వు ఒక రోజు అతనితో గడపాలి అంటూ కండిషన్ పెట్టాడు. ప్రియుడి ఆర్థిక అవసరం తీర్చేందుకు స్నేహితుడు అస్లాం కండిషన్ అంగీకరించింది యువతి. నారాయణగూడలోని సిల్వర్ ఓక్ ఓయో రూమ్లో సాయి అనే యువకుడిని కలిసేందుకు ఒప్పుకుంది. అయితే పక్క ప్లాన్ ప్రకారం అక్కడికి చేరుకున్న అస్లాం సాయితో కలిసి న్యూడ్ వీడియోలను తీసి బెదిరించడం మొదలుపెట్టాడు. అడిగినప్పడల్ల గడపాలని కోరాడు. ఇక ఎలాగో ఒక వీడియో తన బాయ్ ఫ్రెండ్ కి కనిపించింది. తాను కూడా తన బంధువులకు చూపిస్తాను అంటూ బెదిరిస్తున్నాడు. ఇలా 2000 రూపాయలు యువతి జీవితాన్ని తలకిందులు చేసింది. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసింది యువతి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: