ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మనిషి ఆలోచన తీరు ఎటు పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది అని చెప్పాలి. ఎందుకంటే ఎంత కష్టం వచ్చినా కూడా ధైర్యంగా నిలబడే ఎదుర్కొన్న మనిషి.. ఇక ఇప్పుడు చిన్న చిన్న కష్టానికి కుంగిపోతూ ఉండడం చూస్తూ ఉన్నాం. అంతే కాదు చిన్న విషయానికే ఇక జీవితం అక్కడితో ముగిసిపోయింది అని భావిస్తూ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఇక జీవితంలో ఏ చిన్న కష్టం వచ్చినా దానికి పరిష్కారం ఒక్కటే ఆత్మహత్య అన్న విధంగా కొంతమంది ఆలోచన చేస్తూ ఉన్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఇలాంటి ఆలోచన ధోరణితోనే ఉన్నారు అని చెప్పాలి.


 క్షణికావేశంలో  తీసుకుంటున్న నిర్ణయాలా కారణంగా.. ఎంతో మంది బలవన్మరణాలకు పాల్పడుతూ ఇక కుటుంబాల్లో తీరని శోఖాన్ని నింపుతున్నారు. అంతేకాదు నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి ఒక విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. సాధారణంగా 14 ఏళ్ల వయస్సు ఉన్న బాలుడు ఏం చేస్తాడు అంటే.. స్నేహితులతో ఆడుకోవడం లేదంటే ఇక చదువుకోవడం చేస్తూ ఉంటాడు అని అందరూ అంటారు. కానీ ఇక్కడ 14 ఏళ్ల బాలుడు ఏం కష్టం వచ్చిందో చివరికి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. అభం శుభం తెలియని వయసులో చివరికి జీవితాన్నే ముగించేసాడు.



 పెద్ద శంకరంపేట ఇందిరా కాలనీలో నివాసం ఉంటున్న 14 ఏళ్ల శివ తన నివాసంలో ఇటీవలే దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే శివ ఆత్మహత్య చేసుకోవడంతో అటు గ్రామస్తులందరూ కూడా షాక్ అవుతారు అని చెప్పాలి. ఇంత చిన్న వయసులో అతనికి అంత కష్టం ఏం వచ్చిందో అని అందరూ కన్నీరు మున్నీరుగా విలపించారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: