సాధారణంగా సినిమాల్లో ఒక వ్యక్తికి లిఫ్ట్ ఇవ్వడం ఇక ఆ తర్వాత మతిమరుపుతో ఇక కారు ఓనర్ తనే అన్న విషయాన్ని మరిచిపోయి లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తికి కారు అప్పజెప్పి ఇక ఏకంగా కారు దిగి మరి లిఫ్ట్ ఇచ్చినందుకు ఓనర్ థ్యాంక్స్ చెప్పడం లాంటి సన్నివేశాలు చూసాం. ఇలాంటివి చూసి నవ్వుకున్నాం.కానీ ఇలాంటివి నిజ జీవితంలో జరుగుతాయ అంటే అసాధ్యం అంటారు అందరూ. కానీ ఇక్కడ ఇలాంటిదే జరిగింది.ఈ విచిత్రమైన ఘటన గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. తాగిన మత్తులో ఒక వ్యక్తి నుంచి కారూను దొంగలించిన ఘటనపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. ఈ ఘటన హర్యానాలో వెలుగులోకి వచ్చింది.
గురుగ్రామ్ కు చెందిన అమిత్ ప్రకాష్ అనే వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించాడు. కానీ ఇంకా సరిపోలేదు అనుకుని మరోసారి మద్యం తాగేందుకు వెళ్లాడు. అయితే అక్కడికి వెళ్లాక ఒక అపరిచిత వ్యక్తితో అతనికి పరిచయం ఏర్పడింది. ఇక మద్యం మత్తులో అతనికి ఏమీ తెలియలేదు. దీంతో అతనితో కలిసి మళ్ళీ మద్యం సేవించాడు. ఇక ఆ తర్వాత నీకు కాస్త మందు ఎక్కువైంది. నేను కారు నడుపుతాను అంటూ అపరిచిత వ్యక్తి ఇక అమిత్ ప్రకాష్ ను పక్కనే కూర్చోబెట్టుకుని కారులో బయలుదేరాడు. ఇక కొంత దూరం వెళ్లిన తర్వాత కారు దిగు అంటూ సదరు వ్యక్తి చెప్పగా.. కార్ తనదే అన్న విషయాన్ని మర్చిపోయిన అమిత్ ప్రకాష్ కార్ దిగి లిఫ్ట్ ఇచ్చినందుకు థాంక్స్ అంటూ చెప్పాడు. దీంతో ఆ దొంగ కారుతో పాటు కారులోని విలువైన వస్తువులను కూడా దొంగలించాడు. మత్తు దిగాక పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.